Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ – ‘ది రాజా సాబ్’ షూటింగ్ రిస్టార్ట్

Sanjay Dutt Joins in The Raja Saab Shooting: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అరజనుకుపైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఏ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు ఏ సినిమా విడుదల అవుతుందనేది క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో ఉన్నాడు. దీంతో ఆయన సినిమాల షూటింగ్స్‌కి బ్రేక్ పడింది. మళ్లీ షూటింగ్స్ ఎప్పుడెప్పుడు మొదలు పెడతాడా అభిమానులంత ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన సినిమాల అప్‌డేట్స్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ది రాజా సాబ్ అప్‌డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. వారందరికి తాజాగా అదిరిపోయే అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. కాస్తా బ్రేక్ పడిన ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా సెట్‌లో స్టార్ నటుడు అడుగుపెట్టబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ లేటెస్ట్ బజ్ ప్రకారం.. ది రాజా సాబ్ షూటింగ్ కోసం బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ హైదరాబాద్ వచ్చారట. ఆయన ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారట. దీంతో ది రాజా సాబ్ షూటింగ్ తిరిగి మొదలుకానుంది. హైదరాబాద్ నగర శివారులో అజీజ్ నగర్‌లోని ఓ స్టూడియో ఈ మూవీ చిత్రీకరణకు డైరెక్టర్ మారుతి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ పాల్గొంటాడా? లేదా? అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం ప్రభాస్ ఇటలీలో ఉన్న విషయం విదితమే. కామెడీ హారర్, థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఇందులో ప్రభాస్ డ్యుయెల్ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ లుక్‌కి ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రాజుగా నోట్లో సిగర్, మెడలో ముత్యాల హారంతో రాయల్ లుక్‌లో ఆకట్టుకుంది. మూడేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. వాయిదా మీద వాయిదాలతో ఈ చిత్రం షూటింగ్‌ని జరుపుకుంటోంది. దీంతో ఈ మూవీ విషయంలో అభిమానులంత మారుతిపై కాస్తా అసహనం చూపిస్తున్నారు. ఇక మేలో ది రాజా సాబ్ టీజర్ రానుందని ఇటీవల మారుతి ఓ ట్వీట్‌తో హింట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొంది.
ఇవి కూడా చదవండి:
- Nandamuri Balakrishna: బాలయ్యను ఇంప్రెస్ చేసిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ డైరెక్టర్ – క్రేజీ కాంబో సెట్ అయినట్టే..!