Deepika Padukone: స్పిరిట్ కోసం అంత డిమాండ్ చేసిన దీపికా.. ఇది చాలా ఓవర్ గురూ.. ?

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దీపికా పదుకొనే ఎంత ఫేమసో అందరికీ తెల్సిందే. ప్రియాంక చోప్రా తరువాత దీపికానే బాలీవుడ్ ను ఏలుతుంది. అందుకు తగ్గట్లుగానే ఆమె రెమ్యూనరేషన్ అందుకుంటుంది. బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గా దీపికాకు ఒక రికార్డ్ కూడా ఉంది. అయితే.. ఈ చిన్నది తెలుగు సినిమాకు మైండ్ చెదిరే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.
కల్కి 2898AD సినిమాతో దీపికా తెలుగు ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్ పక్కన కాకపోయినా.. ఆ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. మొదటి సినిమాతోనే హిట్ అందుకోవడంతో.. తెలుగు నుంచి ఈ చిన్నదానికి మంచి ఆఫర్లే వస్తున్నాయి. గత కొన్నిరోజులుగా ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ లో దీపికా హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అనిమల్ తో ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్స్ నటిస్తున్నారని టాక్ నడిచింది.
ఇక చివరకు దీపికాను ఫైనల్ చేసినట్లు చెప్పుకొస్తున్నారు. ఈ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ కళ్ళు చెదిరే పారితోషికం అందుకుంటుందని వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. స్పిరిట్ లో నటించడానికి దీపికా దాదాపు రూ. 20 కోట్లు డిమాండ్ చేసిందని అంటున్నారు. ఏంటినిజమా అంటే.. అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. కథలో ఆమె పాత్ర కీలకంగా ఉండబోతుందని, ఆమె అయితేనే న్యాయం చేస్తుందని నమ్మిన మేకర్స్.. ఆమె ఎంత అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని టాక్.
ప్రభాస్ సినిమా అంటే.. హీరోయిన్ ఎవరు అనేది ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోరు. అలాంటి పాత్రకు అంత డిమాండ్ చేయడం ఓవర్ గురూ అని నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. వంగా మాత్రం.. హిందీ నుంచి బ్రాండ్ ఉన్నవారిని దింపాలని చూస్తున్నాడట. అందుకే ఎంతైనాపర్లేదని దీపికాను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే..ఒక స్టార్ హీరోయిన్ ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అది ఒక తెలుగు సినిమాకు తీసుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది.