Published On:

Vivek Agnihotri: బాలీవుడ్‌కి రణ్‌బీర్‌ని బాయ్‌కాట్‌ చేసే ధైర్యం ఉందా? – ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ డైరెక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Vivek Agnihotri: బాలీవుడ్‌కి రణ్‌బీర్‌ని బాయ్‌కాట్‌ చేసే ధైర్యం ఉందా? – ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ డైరెక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Vivek Agnihotri Shocking Comments on Bollywood and Ranbir Kapoor: బాలీవుడ్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశారు ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ మూవీ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి. బాలీవుడ్‌ దర్శక-నిర్మాతలు ఉద్దేశించిన ఆయన షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ముఖ్యంగా ఆయన బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ని టార్గెట్‌ చేసినట్టు ఆయన వ్యాఖ్యల్లో అర్థమైపోతుంది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్‌ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో అదే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ఈ మూవీలో హీరో క్యారెక్టరైజేషన్‌, విపరీతమైన వయోలెన్స్‌పై వ్యతిరేకత వచ్చింది.

 

ఈ సినిమాతో ఏం ఉపయోగం..

ఇలాంటి మూవీతో సమాజానికి ఎలాంటి మెసేజ్‌ ఇస్తున్నారని, ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని విమర్శలు గుప్పించారు. సామాజిక సంఘాలు మాత్రమే కాదు.. దర్శక-నిర్మాతలు సైతం యానిమిల్‌ మూవీని వ్యతిరేకించారు. అందులో ది కశ్మీర్‌ ఫైల్స్‌ మూవీ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి కూడా ఉన్నారు. తాజాగా మరోసాని ఈ సినిమాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా ఓ ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ.. యానిమల్‌ మూవీపై వచ్చిన విమర్శలపై వ్యాఖ్యానించారు. ఈ సినిమా విడుదలైనప్పుడు అందరు డైరెక్టర్‌ని తప్పుబట్టారు.. కానీ ఎవరైన రణ్‌బీర్‌ కపూర్‌ని విమర్శించే ధైర్యం చేశారా? అని ప్రశ్నించారు. నిజానికి రణ్‌బీర్‌ విమర్శించే ధైర్యం ఇండస్ట్రీలో ఎవరికి లేదన్నారు.

 

రణ్‌బీర్‌ ని బాయ్ కాట్ చేయగలరా?

‘యానిమల్‌ రిలీజ్‌ తర్వాత అంత డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగానే విమర్శించారు. కానీ రణ్‌బీర్‌ గురించి ఏ ఒక్కరు కూడా మాట్లాడాలేదు. ఎందుకంటే అతడిని విమర్శించే ధైర్యం ఇండస్ట్రీలో ఏ ఒక్కరికి లేదు. బాలీవుడ్‌లో అతడు చాలా పవర్ఫుల్‌. అందుకే అతడికి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఎవరూ చేయరు. ఇండస్ట్రీలో అతడి విమర్శించే వారు ఎవరు? ఒక్కసారి అతడికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేయమనండి. సందర్భంగా వస్తే అతడిని బాయ్‌కాట్‌ చేయగలరా? అని ప్రశ్రించారు. ఈ విషయంలో నేను సవాల్‌ చేస్తున్నా అన్నారు. నటీనటుల గురించి తప్పుగా మాట్లాడని ఒక్క దర్శక-నిర్మాతని చూపించండి? అలా ఎవరు ఉండరు.

 

అలాంటి నటులంటే నచ్చదు..

ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదోక సమయంలో ఎవరో ఒక హీరోని తిట్టినవారే. కాకపోతే పబ్లిక్‌లో వారి గురించి మాట్లాడే ధైర్యం చేయరు. ఎందుకంటే మళ్లీ వారితో సినిమాల చేయాలి కదా. వారు ఎంత దారుణంగా యాక్ట్‌ చేసిన రూ. 150 కోట్లు చెల్లిస్తారు. తమ అదృష్టాన్ని కూడా నటీనటులకే ఇస్తారు. అందుకే కొన్నిసార్లు బాలీవుడ్‌కు దూరంగా ఉండాలనిపిస్తుంది” అని వివేక్ తెలిపారు. ఇక నిజమైన స్టార్స్‌తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. కెరీర్‌ పరంగా ఏమీ సాధించకపోయిన స్టార్స్ అనే ట్యాగ్‌ పెట్టుకుని చలామణి అయ్యే నటీనటులంటేనే తనకు నచ్చరని వివేక్‌ పేర్కొన్నారు. కాగా యానిమల్‌ రిలీజ్ తర్వాత తనపై వస్తున్న నెగిటివ్‌ కామెంట్స్‌పై దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా స్పందిస్తూ ఇలాగే మాట్లాడారు.

 

అందరు తననే విమర్శిస్తున్నారు.. కానీ ఏ ఒక్కరు రణ్‌బీర్‌ గురించి మాట్లాడలేదన్నారు. “యానిమల్‌ని విమర్శిస్తున్న వారంత రణ్‌బీర్‌ని తెలివైన వ్యక్తిని అని ప్రశింస్తున్నారు ఎవరూ కూడా హీరోని ట్రోల్‌ చేయడం లేదు. కానీ డైరెక్టర్‌ అయిన నాపై తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. ఈ విషయంలో నాకు అసూయ లేదు. కానీ, హీరోని మెచ్చుకుంటూ దర్శకుడిని తిట్టడమే వింత అనుభవం. ఎందుకంటే వారంత రణ్‌బీర్‌తో పనిచేయాలనుకుంటున్నారని నాకు అర్థమైంది. ఇక నేను పరిశ్రమకు కొత్త కాబట్టి నన్ను విమర్శించడం చాలా సులభం. యానిమల్‌ని వ్యతిరేకించిన వారంత రణ్‌బీర్‌తో మాత్రం సినిమా చేయాలనుకుంటున్నారు” అని అన్నారు.