Published On:

Actress Malavika Mohanan: రాత్రి లోకల్‌ ట్రెన్‌లో ప్రయాణం – ఏకంగా ముద్దిస్తావా అన్నాడు: మళవిక మోహనన్‌

Actress Malavika Mohanan: రాత్రి లోకల్‌ ట్రెన్‌లో ప్రయాణం – ఏకంగా ముద్దిస్తావా అన్నాడు: మళవిక మోహనన్‌

Actress Malavika Mohanan Shared her Opinion on Women Safety: మాళవిక మోహనన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విజయ్‌ మాస్టర్‌ చిత్రంలో తెలుగు ప్రేక్షకులను అలరించింది. గతేడాది విక్రమ్‌ తంగలాన్‌లో నటించి అలరించింది. ప్రస్తుతం ప్రభాస్‌ రాజా సాబ్‌లో నటిస్తున్న ఈ భామ తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ముంబై లోకల్‌ ట్రైన్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది.

 

ముంబై లాంటి మెట్రో నగరంలో మహిళల భద్రతపై ఆమె స్పందించింది. “ఓ రోజు ముంబైలో నా స్నేహితులతో కలిసి లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణించా. అప్పుడు రాత్రి 9:30 అవుతుంది. ఫస్ట్‌ క్లాస్‌ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కాం. అందులో నేనే, నా స్నేహితులు తప్ప ఎవరూ లేరు. ఆ సమయంలో ఓ వ్యక్తి అందులోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. కంపార్ట్‌మెంట్‌ వద్ద ఉన్న గ్లాస్‌ డోర్‌ నుంచి మావైపే చూస్తున్నాడు. ముద్దు ఇస్తావా? అని సైగలు చేశాడు. అప్పుడు అతడి ప్రవర్తనతో మేమంతా భయానికి గురయ్యాం. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. దాదాపు 10 నిమిషాల తర్వాత వేరే స్టేషన్‌ రాగానే కొంతమంది ప్రయాణికులు మా కంపార్ట్‌మెంట్‌లో ఎక్కారు. దీంతో మేము ఊపిరి పీల్చుకున్నాం” అని చెప్పుకొచ్చింది.

 

ఇక హీరోయిన్లు ఎలా ఉండాలనేది ఇండస్ట్రీని బట్టి మారుతుందని మాళవిక అన్నారు. దక్షిణాదిలో హీరోయిన్‌గా కనిపించాలంటే ఆమె సన్నగా ఉండకూడదన్నారు. తన శరీరాక్రతి విషయంలో తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కాన్నానని మాళవిక చెప్పుకొచ్చారు. తన శరీరంపై విమర్శలు చేశారని, అవి తనని ఎంతో బాధించాయని ఆమె చెప్పింది. 21 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చాను. ఇక్కడ అడుగుపెట్టిన కొత్తలో నా లుక్స్‌ పరంగా నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న. నా తొలి సినిమా విడుదలయ్యాక చాలా సన్నగా ఉన్నానని ట్రోల్స్ చేశారు. ఆ తర్వాత నా శరీరాక్రతిలో మార్పు వచ్చింది. కొంచెం లావు అయ్యాను. అప్పుడు కూడా నాకు విమర్శలు తప్పలేదు. ఇవన్ని నన్నేంతో బాధించాయి. దక్షిణాది చిత్రాల్లో కనిపించాలంటే అమ్మాయి కాస్త బొద్దుగా ఉండాలి” అని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.