Last Updated:

Rajiv Gandhi: ’మీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి నాన్నా‘

మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 32 వ వర్థంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నారు. రాజీవ్ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ఢిల్లీలోని వీర్ భూమి వద్ద నివాళులు అర్పించారు.

Rajiv Gandhi: ’మీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి నాన్నా‘

Rajiv Gandhi: మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 32 వ వర్థంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నారు. రాజీవ్ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లు ఢిల్లీలోని వీర్ భూమి వద్ద నివాళులు అర్పించారు.

Rajiv Gandhi death anniversary: Rahul Gandhi, Sonia Gandhi, Mallikarjun  Kharge pay homage to former prime minister | Mint

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ… తన తండ్రి ని తలుచుకుంటూ  భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘ పాపా మీరు నాతోనే ఉన్నారు. మీరే స్పూర్తి, మీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయ’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో పాటు రాజీవ్ గాంధీ జ్ఞాపకాలను గుర్తు చేసే ఓ వీడియోను కూడా షేర్ చేశారు. మరో వైపు ప్రియాంక గాంధీ కూడా తన తండ్రిని స్మరించుకుంటూ హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన కవితను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

 

 

మోదీ నివాళి(Rajiv Gandhi)

మరో వైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం దివంగత రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. 1944, ఆగష్టు 20న జన్మించిన రాజీవ్ గాంధీ ఉత్తర ప్రదేశ్ లోని అమేథీ పార్లమెంటరీ నియోజకవర్గానికి 4 సార్లలు ప్రాతినిధ్యం వహించారు. 1984 నుంచి 1989 వరకూ దేశ 6 వ ప్రధానిగా సేవలు అందించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యా అనంతరం రాజీవ్ ప్రధానిగా భాద్యతలు చేపట్టారు. 40 ఏళ్ల వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. 1991 , మే 21 ఎల్టీటీఈ మహిళా సూసైడ్ బాంబర్ చేతిలో రాజీవ్ కన్నుమూశారు. ఆయన స్మారకార్థం ప్రతి ఏటా మే 21 వ తేదీని జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని దేశం జరుపు కుంటుంది.