Home / Sonia Gandhi
Congress: ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసులో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ మీటింగ్ జరిగింది. భేటీకి కాంగ్రెస్ పెద్దలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సఖ్విందర్ సింగ్ సుఖ్ సహా.. పలువురు నేతలు హాజరయ్యారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పహల్గాం దాడి తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులు, కులగణనకు కేంద్రం ఓకే చెప్పడంపై చర్చించారు. కాగా పహల్గాం దాడితో దేశంలో అలజడి […]
National Herald case : సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తాజాగా ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఛార్జిషీట్‌పై న్యాయబ్ధమైన విచారణ జరిగే సమయంలో అవతలి పక్షంవారు తమ వాదనలు వినిపించే హక్కు ఉంటుందని ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నే తెలిపారు. కేసు తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన చట్ట […]
ED files Charge Sheet Against Rahul Gandhi, Sonia Gandhi in National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీతో పాటు ఆమె కుమారుడు రాహుల్ గాంధీ పేర్లు ఉన్నాయి. వీరితో పాటు శామ్ పిట్రోడా, సుమన్ దూబె, ఇతర నేతలపై ఎన్‌ఫోర్స్‌మంట్ డైరెక్టరేట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసుకు […]
Sonia Gandhi Discharged From Ganga Ram Hospital In Delhi: కాంగ్రెస్ అగ్రనేత, యూపీఏ మాజీ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఉదర సంబంధిత వ్యాధితో ఆమె నిన్న రాత్రి ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ మేరకు ఆమెకు గ్యాస్ట్రో ఎంటరాలజీ స్పెషలిస్టు డాక్టర్ సమీరన్ నందీ ట్రీట్ మెంట్ నిర్వహించారు. రాత్రి నుంచి ఆమె […]
Sonia Gandhi Says No clarity when Census will be conducted in Rajya Sabha: లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా రాజ్యసభలో తన తొలి జీరో అవర్ జోక్యంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. 140 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే గతంలో ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చినట్లు గుర్తు […]
బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధాని మోదీ మాట్లాడుతూఆటోపైలట్, రిమోట్పైలట్తో ప్రభుత్వాన్ని నడిపే వారు కూడా ఉన్నారంటూ పరోక్షంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై విమర్శలు ఎక్కు పెట్టారు
ఎగ్జిట్ పోల్స్‌ను ఇండియా కూటమి తేలికగా కొట్టిపారేసింది. 2024 లోకసభ ఎన్నికలల్లో ప్రస్తుతం వస్తున్న ఎగ్జిట్‌పోల్స్‌కు పూర్తిగా వ్యతిరేకంగా ఫలితాలు ఉంటాయని ప్రతిపక్ష పార్టీ భావిస్తోంది. కాగా దేశంలోని పలు చానల్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో దాదాపు అన్నీ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఘనవిజయం సాధిస్తుందని అంచనా వేశాయి.
సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దైంది. అనారోగ్య కారణాలతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియా హాజరు కావడం లేదని ఏఐసీసీ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం రేపు హైదరాబాద్‌కు సోనియా గాంధీ రావాల్సి ఉంది. అయితే.. అనారోగ్యం కారణంగా రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో తెలంగాణ పర్యటనను సోనియా రద్దు చేసుకున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ తొలి పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పిఎసి) సమావేశం సోమవారం గాంధీభవన్‌లో జరిగింది. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రం నుండి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని పోటీకి దింపాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఈ విషయాన్ని తెలియజేసారు.
సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా గాంధీ భవన్లో పుట్టినరోజు ఘనంగా జరిగాయి. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేక్ కట్ చేసి సోనియాగాంధీకి విషెస్ తెలిపారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత మొదటిసారి రేవంత్ రెడ్డి గాంధీభవన్ రావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. సోనియా గాంధీకి 78 వ పుట్టిన రోజు సందర్భంగా రేవంత్ రెడ్డి 78 కిలోల కేక్ కట్ చేశారు.