Gannavaram Issue : తెదేపా నేత పట్టాభితో పాటు మరో 15 మంది అరెస్ట్.. ఎన్ని రోజులు రిమాండ్ అంటే?
ఏపీలో రాజకీయాలు రణరంగంగా మారుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పరిస్థితి అదుపు తప్పుతోంది ఏమో అనుమానం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలుగుతుంది. రాజకీయ దాడులు, ప్రతిదాడులతో.. గన్నవరం రాజకీయాలు మరింత వేడెక్కడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Gannavaram Issue : ఏపీలో రాజకీయాలు రణరంగంగా మారుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పరిస్థితి అదుపు తప్పుతోంది ఏమో అనుమానం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలుగుతుంది. రాజకీయ దాడులు, ప్రతిదాడులతో.. గన్నవరం రాజకీయాలు మరింత వేడెక్కడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యాలయంపై దాడులు, విధ్వంసాలకు దిగడంపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇంత చేసినా ఎమ్మెల్యే వంశీపైన కానీ.. ఆయన అనుచరులపై కేసు నమోదుచేయకపోవండాన్ని ఆక్షేపిస్తున్నాయి. పైగా తిరిగి టీడీపీ నేతలపైనే కేసులు పెట్టడాన్ని మండిపడుతున్నాయి.
గన్నవరంలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తున్న తనకు హాని కలిగించేలా పట్టాభి మరియు టిడిపి నాయకులు యత్నించారని సిఐ కనకరావు ఫిర్యాదు చేసారు. కులం పేరుతో దూషించారని సీఐ పిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పట్టాభితో పాటు దొంతు చిన్నా, మరికొందరు టిడిపి నాయకులకు అట్రాసిటీ, హత్యాయత్నం కేసు నమోదు చేసారు. ఈ కేసులోనే గన్నవరం న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు – పట్టాభి (Gannavaram Issue)
తనను అరెస్ట్ చేసిన పోలీసులు ఎవ్వరికీ తెలియనివ్వకుండా తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పట్టాభి తెలిపారు. స్టేషన్ లోని ఓ చీకటి గదిలోకి తనను ఈడ్చుకెళ్లి ముసుగు వేసుకుని వచ్చిన ముగ్గురు విచక్షణారహితంగా కొట్టారని అన్నారు. ముఖానికి టవల్ చుట్టి అరికాళ్లు, అరచేతులపై లాఠీలతో కొడుతూ థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పట్టాభిరాం న్యాయమూర్తికి తెలిపినట్లు సమాచారం.
అంతకు ముందు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడమే కాకుండా.. పలువురు గుర్తుతెలియని వ్యక్తులు టీడీపీ నేతల వాహనాలపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. కత్తులతో తిరిగి హల్ చల్ చేశారు. దీనిపై నిరసన తెలపడానికి గన్నవరం బయలుదేరారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకొని నేతలను అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను అదుపులోకి తీసుకున్నారు. నెట్టెం రఘురాం, తంగిరాల సౌమ్య, బొండా ఉమా, బుద్దా వెంకన్న తదితర నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ను అరెస్ట్ చేసి నాగాయలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత పట్టాభిని ఎక్కడకి తీసుకెళ్లారో తెలియడం లేదు. ఆయన ఫోన్ సైతం స్విచ్ఛాప్ వస్తోంది. ఆయనకు ఏదైనా జరగరానిది జరిగితే అందుకు సీఎం జగన్.. డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన భార్య చందన హెచ్చరించారు. గన్నవరం ఇష్యూపై టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/