Last Updated:

AP WhatsApp Governance: దేశంలోనే తొలిసారిగా.. తొలి విడతలో 161 సేవలు!

AP WhatsApp Governance: దేశంలోనే తొలిసారిగా.. తొలి విడతలో 161 సేవలు!

Minister Nara Lokesh launches AP WhatsApp Governance: దేశంలోనే తొలిసారి వాట్సప్ గవర్నెన్స్ సేవలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. తొలి విడతలో 161 సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మనమిత్ర పేరుతో వాట్సప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. దేవాదాయ, ఆర్టీసీ, విద్యుత్, రెవెన్యూ, సీఎంఆర్ఎఫ్, ఆరోగ్య కార్డులు, మున్సిపల్ సేవల కోసం వాట్సప్‌లో 9552300009 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ సేవలకు గానూ గత అక్టోబర్‌లో ప్రభుత్వం మెటాతో ఒప్పందం చేసుకుంది.

మాది ప్రజాప్రభుత్వమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని మంత్రి నారా లోకేశ్ అన్నారు. నేను పాదయాత్ర చేసే సమయంలో అనేక మంది ప్రజలను కలిశారన్నారు. గతంలో ఏ చిన్న సర్టిఫికెట్ కావాలన్నా.. కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదన్నారు. కాగా, వాట్సప్ అందరూ వాడే ఫోన్ అప్లికేషన్ ఉంటుందన్నారు. ఆ ఎకౌంట్‌కు వెరిఫైడ్ ట్యాగ్ ఉందని, పౌర సేవలు అందివ్వడంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సప్ గవర్నెన్స్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు.

చంద్రబాబు 2.0 పనితీరుకు మరో మైలురాయని, సర్టిఫికెట్ల కోసం కార్యాలయాలు చుట్టూ తిరిగే పరిస్థితి రాదన్నారు. ఇవాళ 161 సేవలను లాంఛ్ చేశామని, త్వరలో 360 సేవలకు విస్తరిస్తామని వెల్లడించారు. మరో 3 నుంచి 4 నెలల్లో వాయిస్ బేస్డ్ ఏఐ బోట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. ఏదైనా సమస్య వస్తే తామే కస్టమర్‌కు ఫోన్ చేసి పరిష్కరిస్తామన్నారు.