Published On:

Amaravati: అమరావతిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

Amaravati: అమరావతిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

Amaravati: ఇవాళ అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కూటమి నేతలు, ప్రజా ప్రతినిధులతో టెలి కాన్ఫెరెన్సు నిర్వహించనున్నారు. అమరావతి రీ లాంచ్ కార్యక్రమానికి వీరిని సీఎం ఆహ్వానించనున్నారు. అలాగే వీఐటి-ఏపీ విశ్వవిద్యాలయంలో వి-లాంచ్ పాడ్ 2025 గ్లోబల్ ఇన్నోవేటర్స్ ఛాలెంజ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించనున్నారు. మహాత్మా గాంధీ, వి.వి.గిరి, దుర్గాబాయి దేశముఖ్ బ్లాకుల నూతన భవనాలను కూడా ఆయన ప్రారంభించనున్నారు. అలాగే వివిధ శాఖల్లో సేవలు, పథకాల అమలు తీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.

 

అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మే 2వ తేదీన జరిగే సభ ఏర్పాట్లపై ఉండవల్లి నివాసంలో మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించారు. గత ప్రభుత్వం అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు, దాడులు చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే గత ప్రభుత్వ కారణంగా నిలిచిపోయిన పనులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రధాని మోదీ కూడా రాజధాని నిర్మాణంపై ఆసక్తితో ఉన్నారన్నారు.

 

ఎండల తీవ్రత దృష్ట్యా దూర ప్రాంతాల నుంచి సభకు వచ్చే వారికి తాగునీరు, ఆహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అమరావతిలో రాజధాని సభకు సుమారు 5 లక్షల మంది వస్తారని మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతి రైతులకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసామని తెలిపారు.