Telangana : డ్రంక్ అండ్ డ్రైవ్.. హైదరాబాద్‌లో ఎంత మంది దొరికారో తెలుసా? అందరి లైసెన్సులూ రద్దు!
Telangana : తెలంగాణలో మందుబాబులకు రవాణాశాఖ పెద్ద షాక్ ఇచ్చింది. కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ మహా నగరంలో తాగి వాహనాలు నడుపుతూ
Telangana : తెలంగాణలో మందుబాబులకు రవాణాశాఖ పెద్ద షాక్ ఇచ్చింది. కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ మహా నగరంలో తాగి వాహనాలు నడుపుతూ దొరికిన మందుబాబులు అవాక్కవుతున్నారు. డిసెంబర్ 31, శనివారం సాయంత్రం నుంచి ఆదివారం వేకువఝాము వరకు నగర పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. నగరంలోని అనేక చోట్ల నిర్వహించిన ఈ టెస్టుల్లో మొత్తం 5,819 మంది పట్టుబడ్డారు. పోలీసులు వారి వాహనాలను స్వాధీనం చేసుకుని, డ్రైవింగ్ లైసెన్స్‌లు క్యాన్సిల్ చేస్తున్నారు.
ఆర్టీఏ అధికారులు నగర పరిధిలోని ఐదు జోన్లలో ఈ చెకింగ్ లను నిర్వహించారు. తాగి వాహనాలు నడిపి, ప్రమాదాలకు కారణం కాకూడదనే ఉద్దేశంతో ఈ టెస్టులు నిర్వహించామని అధికారులు వెల్లడించారు. అలాగే రోడ్డు ప్రమాదాలు చేసిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్త్ జోన్ పరిధిలో 1103 లైసెన్స్‌లు, సౌత్ జోన్ పరిధిలో 1151 లైసెన్స్‌లు, వెస్ట్ జోన్లో 1345 లైసెన్స్‌లు, ఈస్ట్ జోన్లో 510 లైసెన్స్‌లతో పాటు, సెంట్రల్ జోన్లో కూడా పలువురి లైసెన్స్‌లు క్యాన్సిల్ చేశారు.
గతేడాది ఇదే సమయంలో 3220 లైసెన్స్‌లు మాత్రమే క్యాన్సిల్ అయ్యాయి. అప్పుడు రోడ్డు ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో దొరికిన వారితో పోలిస్తే, ఈ ఏడాది దొరికిన వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. కాగా మరోవైపు గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,819 మంది వాహనదారుల లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. ఈ ఏడాది మొదటి రోజే ఇంత మంది పట్టుబడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. హైదరాబాద్ లో గతేడాది 4109 మంది వాహనదారుల లైసెన్సులను రద్దు చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.