Heat Stroke 4 Lacks ex-gratia in Telangana: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి రూ.50వేల నుంచి రూ.4 లక్షల వరకు పెంపు

Telangana Government Increased Heat stroke ex-gratia from Rs 50,000 to Rs.4 lacks: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నుంచే రాష్ట్రంలో ఎండలు విపరీతంగా వ్యాపిస్తున్న తరుణంలో కీలక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, భారత వాతావరణ కేంద్రం సైతం ఈ ఏడాది ఎండలు విపరీతంగా పెరగనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. వడదెబ్బతో మృతిచెందిన బాధితుల కుటుంబాలకు రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు హీట్ వేవ్, సన్ స్ట్రోక్‌ను స్టేట్ డిజాస్టర్‌గా ప్రకటిచింది. అంతేకాకుండా వడగాలులను విపత్తుగా ప్రకటిస్తూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వడదెబ్బ కారణంగా చనిపోయిన వారికి ఎస్‌డీఆర్ఎఫ్ కింద ఆపద్బంధు పేరుతో ఒక్కొక్కరికి రూ. 4లక్షలు ఇవ్వనుంది. కాగా, గతంలో వడదెబ్బ బాధితులకు రూ.50వేల ఎక్స్ గ్రేషియో అందిస్తుండగా.. తాజాగా, రూ. 4లక్షలకు పెంచుతూ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.