Last Updated:

TG Government: రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన.. రాష్ట్రంలో 10,954 ప్రభుత్వ ఉద్యోగాలకు మార్గదర్శకాలు

TG Government: రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన.. రాష్ట్రంలో 10,954 ప్రభుత్వ ఉద్యోగాలకు మార్గదర్శకాలు

Telangana Government Revenue Department Jobs: రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఉన్న 10,954 గ్రామ పాలన ఆఫీసర్(జీపీఓ) పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు గతంలో వీఆర్ఓ, వీఆర్ఏలుగా పనిచేసిన ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించనున్నట్లు తెలిపింది. అయితే ఈ పోస్టులకు తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలని సూచించింది. అయితే డిగ్రీ అర్హత లేని సమక్షంలో ఇంటర్ పూర్తి చేసి వీఆర్ఓ లేదా వీఆర్ఏగా కనీసం 5 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలని పేర్కొంది.

 

కాగా, ప్రభుత్వం విడుదల చేసిన జీఓలో విధివిధానాలు, అర్హతలను ఖరారు చేసింది. ఇందు కోసం అర్హత ఉన్న మాజీ వీఆర్ఓలు, వీఆర్ఏలకు స్క్రీనింగ్ పరీక్ష సైతం నిర్వహించి ఎంపిక చేయాలని జీఓలో పేర్కొంది. కాగా, వీరు అకౌంట్స్ నిర్వహణ, సర్టిఫికెట్ల ఎంక్వైరీ వంటి విధులను నిర్వహించే అవకాశం ఉంది.