Uttham Kumar Reddy : ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ రైస్ : ఉత్తమ్ కుమార్‌రెడ్డి

Uttham Kumar Reddy : కాంగ్రెస్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రైస్‌ను ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేయనుంది. ఫిలిప్పీన్స్‌తో జరిగిన ఒప్పందం మేరకు 8 లక్షల టన్నుల రైస్‌ను ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇవాళ తొలివిడతగా 12,500 టన్నుల రైస్‌ను ఏపీలోని కాకినాడ పోర్టు నుంచి షిప్పింగ్ చేస్తోంది. కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు నేడు కాకినాడ వెళ్లిన మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి జెండా ఊపి నౌకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక నుంచి ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేసే బియ్యాన్ని కాకినాడ మీదుగా పంపించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. MTU1010 రకానికి చెందిన 12,500 టన్నుల బియ్యం గల నౌక ఫిలిప్పీన్ బయలుదేరి వెళ్లింది. మంత్రి వెంట ఉన్నతాధికారులు, ఫిలిప్పీన్ అధికారులు ఉన్నారు.