Home / Telangana Government
Konidela Upasana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా తీసుకువచ్చిన స్పోర్ట్స్ పాలసీలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, క్రీడా నిపుణులకు కీలక పదవులు అప్పగించింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెలకు కీలక పదవి దక్కింది. తాజాగా ప్రకటించిన తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ కు ఉపాసన కో- చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. ఈ బోర్డుకు లక్నో సూపర్ జైంట్స్ […]
Telangana High Court: సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని సిగాచీ పరిశ్రమలో పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. కె.బాబూరావు అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సిగాచీ పరిశ్రమ యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల పేలుడు సంభవించిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఘటనలో 54 మంది మృతిచెందగా, 28 మంది గాయపడ్డారని, 8 మంది ఆచూకీ లభించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వసుదా నాగరాజు హైకోర్టుకు తెలిపారు. […]
Telangana Government: రాష్ట్రంలో రవాణాశాఖలో సర్వీస్ ఛార్జీలు భారీగా పెరిగాయి. దీంతో వాహన యజమానులపై భారీగా అదనపు భారం పడింది. టాక్సేషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్లకు సంబంధించిన ఛార్జీలను గణనీయంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో చివరిసారిగా సర్వీస్ ఛార్జీలను సవరిస్తే ఇప్పుడు మళ్లీ పెండు చేపట్టడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. కొత్త రేట్ల ప్రకారం లైసెన్స్ సర్వీస్ ఛార్జీని రూ. 200కు, మోటార్ వెహికల్ […]
Telangana Government: తెలంగాణలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంగలు, నదులు ఉప్పొంగుతున్నాయి. భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు సహాయక చర్యల్లో భాగంగా అన్ని జిల్లాలకు నిధులు విడుదల చేసింది. ఒక్కో జిల్లాకు రూ. కోటి చొప్పున 33 జిల్లాలకు రూ. 33 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రజలను అప్రమత్తం చేయడం, అత్యవసర సాయం చేయడం కోసం డిజాస్టర్ […]
G.O. No 49: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాదాస్పద జీవో నెం. 49 ను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. అయితే ఈ నిర్ణయంపై స్థానిక ఆదివాసీలలో అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని జీవోను నిలిపివేయాలని ఆధికారులను ఆదేశించారు. ఆదివాసీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, వారి ఆందోళనలను నివృత్తి చేసే వరకు జీవో అమలును నిలిపి ఉంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కన్జర్వేషన్ కారిడార్ వల్ల […]
Telangana Government: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలోనే రాహుల్ సిప్లిగంజ్ గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ హైదరాబాదీ సింగర్ కు అవార్డు ఇవ్వకపోయినా ఏదో ఒకటి ఇవ్వాలని సీఎం చెప్పగా దానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఓకే చెప్పారు. ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటతో ఆస్కార్ అందుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ […]
Telangana Government: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చూట్టూ మరో ప్రాజెక్ట్ చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు ఓఆర్ఆర్ చుట్టూ వినూత్నంగా ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ను చేపట్టాలని నిర్ణయించింది. తెలంగాణ రవాణా రంగ అభివృద్ధిలో కీలక మైలురాయిగా భావిస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి తుది లొకేషన్ సర్వే కూడా పూర్తి అయింది. ఈ ప్రాజెక్ట్ అమలులోకి వస్తే, రాష్ట్ర రాజధాని చుట్టూ కొత్త రైల్వే మార్గం ఏర్పడనుండగా, ఇది దేశంలోనే […]
Local Body Elections: జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను తెలంగాణ సర్కారు ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 566 ఎంపీపీ, జడ్పీటీసీ, 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో సర్కారు జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేస్తూ ప్రకటన చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఎన్నికల మెటీరియల్ […]
Telangana Government: ఇందిరమ్మ క్యాంటీన్లలో రూ. 5 కే టిఫిన్ అందించే పథకం అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇవ్వబోయే బ్రేక్ ఫాస్ట్ మెనూను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సిద్ధం చేసింది. ఈ నిర్ణయంతో ప్రజల నుంచి ఒక్కో ప్లేట్ టిఫిన్ కోసం రూ. 5 మాత్రమే వసూలు చేయనుంది. మిగిలిన రూ. 14 ఖర్చును ప్రభుత్వం భరించనుంది. ఒక్క టిఫిన్ కు రూ. 19 ఖర్చు అవుతుందని అంచనా […]
Engineering Colleges: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఫీజులు పెంచాలన్న కాలేజీల అభ్యర్థనను తిరస్కరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు విడుదల చేసింది. ఆరు వారాల లోపు ఇంజినీరింగ్ ఫీజులను నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీకి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర సర్కార్ తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని హైకోర్టు చెప్పింది. కాలేజీల నిర్వహణ ఖర్చులు పెరిగాయని, నాణ్యమైన విద్యకు తగిన వనరులు కావాలంటూ ప్రైవేట్ కాలేజీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. […]