Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై కేసు.. అరెస్ట్ తప్పదా..?
జనసేనాని పవన్ కల్యాణ్ పై ఏపీ ప్రభుత్వం కేసు పెట్టడం సంచలనంగా మారింది. ఇప్పటం పర్యటనలో భాగంగా కారుపై కూర్చుని వెళ్లడాన్ని చూపిస్తూ ర్యాష్ డ్రైవింగ్ కింద పవన్ పై నిన్న తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ మేరకు పవన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్ పై ఏపీ ప్రభుత్వం కేసు పెట్టడం సంచలనంగా మారింది. ఇప్పటం పర్యటనలో భాగంగా కారుపై కూర్చుని వెళ్లడాన్ని చూపిస్తూ ర్యాష్ డ్రైవింగ్ కింద పవన్ పై నిన్న తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ మేరకు పవన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఐపిసిలోని 336, 279 , రెడ్ విత్ 177 ఎంవీ యాక్ట్ క్రింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇప్పటం గ్రామం వెళ్లే సమయంలో కారు పై కూర్చొని పవన్ వెళ్లడాన్ని బూచీగా చూపిస్తూ డ్రైవర్ రాష్ డ్రైవింగ్ పై కేసులు నమోదు చేశారు. జాతీయ రహదారి పై పవన్ వాహన శ్రేణిని పలు వాహనాలు అనుసరించడంపై కూడా కేసు నమోదు చేశారు. తెనాలి మారిస్ పేటకు చెందిన పి.శివ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పవన్ కళ్యాణ్ , అతని కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
అంతేకాకుండా తెలంగాణా రిజిస్ట్రేషన్ నంబర్ తో ఉన్న కారుపై కూర్చొని పవన్ ప్రయాణించారు. అందుకే ఆ కారుపై కూడా ఛలానా కూడా వేశారు. ఇతరుల భద్రతకు ముప్పు కలిగించే విధంగా వ్యవహరించినందుకు ఐపిసి 336 సెక్షన్, రహదారి పై నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన కారణంగా ఐపిసి లోని 279 సెక్షన్ కింద కేసులు పెట్టారు.
ఇదీ చదవండి: ఏపీకి మంచి రోజులు వస్తాయి.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు