Home / Breaking News
Tarakaratna Died: తారకరత్న గుండెపోటు తీరని విషాదాన్ని మిగిల్చింది. 22 రోజులుగా చికిత్స తీసుకుంటున్నఆయన మృతి చెందినట్లు బెంగుళూరు నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేష్ కుమార్‌ను ఏపీ కేడర్‌కు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమేష్‌కుమార్ వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది.
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండుగ రద్దీ వేళ ప్రయాణికుల సౌకర్యార్థం ఏకంగా 4,233 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇటీవల కాలంలో ముగ్గురు పిల్లలు ఉన్న కారణంగా నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్న పద్మావతిని పదవి నుంచి తొలగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దానితో నూతన జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎంపిక ఉత్కంఠ భరితంగా మారనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల ఎన్నికల జరిగిన సంగతి తెలిసిందే. కాగా నేడు అక్కడ ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఆ తర్వాత ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు. గుజరాత్‌లో 182, హిమాచల్ ప్రదేశ్‌లో 68 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో ఐటీ అధికారులు దాడులు చేపట్టడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే రెండు రాష్ట్రాల్లోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. వైసీపీ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ యువనేత దేవినేని అవినాశ్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని సజ్జల ఖండించారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని సజ్జల స్పష్టం చేశారు. ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎవరినీ తొలగించబోవడంలేదని అన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ముమ్మర దర్యాప్తు చేపట్టింది. ఇటీవలె కాలంలోనే తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. కాగా ఎఫ్ఐఆర్ లో నిందితుల జాబితాలో తన పేరు లేదని సీబీఐకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజురోజుకు అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు సీరియస్ గా తీసుకున్న ఈడీ విచారణను వేగవంతం చేస్తోంది. ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ఈ కేసు విషయంలో కవిత మీడియా ముందుకు వచ్చారు.
లైగర్ సినిమా నిర్మాణంలో మనీ లాండరింగ్ జరిగిందన్న నేపథ్యంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ సినిమా పెట్టుబడుల విషయమై ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో ఈ చిత్ర దర్శక నిర్మాతలైన పూరీ జగన్నాథ్, చార్మీలను అధికారులు విచారించారు. కాగా తాజాగా నేడు ఈ సినిమా హీరో అయిన విజయ్ దేవరకొండను కూడా విచరణకు పిలిపించారు.