Telangana: ఇంటర్నేషనల్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు

Telangana: రాష్ట్రంలో ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పమని.. దాని కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సర్కార్ బడులపై పేరెంట్స్ నమ్మకాన్ని పెంచి వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
విద్యారంగంలో సంస్కరణలు అనే అంశంపై నియమించిన మంత్రివర్గ ఉప సంఘం సచివాలయంలో సమావేశమైంది. పేరెంట్స్, మేనేజ్‌మెంట్, విద్యాశాఖ అధికారులతో సుమారు 5 గంటల పాటు భేటీ జరిగింది. గత పదేండ్లలో రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన విద్యావ్యవస్థ ముఖ చిత్రాన్ని మార్చాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇది ప్రజల కోసం పని చేసే ప్రభుత్వమని.. మాటల్లో కాదు చేతల్లో మార్పును చూపిస్తామన్నారు.
మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధమైంది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ పర్యటన సందర్భంగా వరంగల్‌లోని వేయిస్తంభాల గుడి, రామప్ప టెంపుల్ ముస్తాబైంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టి పడేలా ఏర్పాట్లు చేశారు. రేపు సాయంత్రం ప్రసిద్ధ ప్రదేశాలను వివిధ దేశాలకు చెందిన అందాలభామలు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక విద్యుత్ దీపాల కాంతులతో ఖిలా వరంగల్, రామప్ప టెంపుల్‌ను తీర్చిదిద్దారు. అంతేకాకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది.
ఇవాళ సాయంత్రం చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ జరగనుంది. ఈ వాక్‌లో 109 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు పాల్గొననున్నారు. చార్మినార్ దగ్గర సుందరీమణుల ప్రత్యేక ఫోటో షూట్ కూడా జరగనుంది. అలాగే చౌమహల్లా ప్యాలెస్‌లో నిజాం సంప్రదాయ వస్త్రధారణలో సుందరీమణులు అలరిస్తారు. అనంతరం నిజాం రాజులు వాడిన వస్తువుల ప్రదర్శన జరగనుంది.