Delhi Assembly Election Results 2025: ఢిల్లీలో బీజేపీ విక్టరీ.. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?
![Delhi Assembly Election Results 2025: ఢిల్లీలో బీజేపీ విక్టరీ.. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/AP-Deputy-CM-Pawan-Kalyan.jpg)
AP Deputy CM Pawan Kalyan Interesting Comments on BJP Victory In Delhi: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగరవేసింది. అవినీతి ఆమ్ ఆద్మీ పార్టీ పాలనకు ఢిల్లీ ప్రజలు తిరస్కరించారు. తాజాగా, ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ప్రధాని మోదీపై ప్రజలకు ఉన్న విశ్వాసం మరోసారి రుజువైందని పవన్ కల్యాణ్ అన్నారు. మోదీ లక్ష్యాలకు అందుకోవడంతో ఢిల్లీ పాత్ర కీలకమని చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా ప్రధాని మోదీ పాలన కొనసాగిస్తారని కొనియాడారు.
అలాగే ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. బీజేపీ హామీలపై ప్రజలకు నమ్మకం ఉందని చెప్పారు. దీంతో పాటు హోం మంత్రి అమిత్ షా రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలు ఇచ్చాయని పేర్కొన్నారు.