NTR Bharosa Pension: కొత్తగా 89వేల మందికి పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!

NTR Bharosa Pension: రాష్ట్రంలో కొత్తగా వితంతు పెన్షన్లను ఇస్తున్నారు. ఇప్పటివరకు అప్లైచేసుకోనివారు ఈ నెల చివరి తేదీవరకు నమోదు చేసుకోవచ్చు. భర్త చనిపోయిన మహిళలు మాత్రమే ఈ పెన్షన్లకు అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి కేవలం 6రోజులే ఉంది. ఎన్టీఆర్ భరోసా పించన్ కేటగిరిలో ప్రతీనెల రూ.4వేల రూపాయలను అందించనున్నారు. అర్హులైన మహిళలు భర్త మరణించిన సర్టిఫికేట్ తో పాటు ఆధార్ కార్డు తదితర వివరాలను జతచేసి దరఖాస్తు చేసుకోవాలి. కొత్తగా 89,788మందికి పించన్లను ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై నెలకు రూ.35.91కోట్ల రూపాయల భారం పడుతుంది.
ఏప్రిల్ 25నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇంకో ఆరు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. మే1 నుంచి పింఛన్ ను అర్హులైన వారికి అందజేస్తారు. 2023 డిసెంబర్ 1నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య పెన్షన్లు కోల్పోయిన అర్హులకు మే1నుంచి పింఛన్ అందిస్తున్నారు. దీన్ని స్పౌజ్ కేటగిరిగా గుర్తించి గతేడాది నవంబర్ నుంచే అమలు చేస్తున్నారు. ఈ నెల 30లోపు అప్లై చేసుకుంటే మే1న పింఛన్ అందుతుంది. ఏప్రిల్ 30 తర్వాత నమోదు చేసుకున్న వారికి జూన్ 1 ఇవ్వనున్నారు. గత కొన్ని రోజులుగా సీఎం చంద్రబాబు వేరే కార్యక్రమాలలో బిజీగా ఉండటంవలన పించన్ల ప్రక్రియ ఇప్పటికి కార్యరూపం దాల్చింది.
భర్త చనిపోయిన మరుసటి నెలనుంచే పింఛన్ అందజేయడానికి ఏర్పాట్లు చేశారు. అందుకు తగిన సర్టిఫికెట్స్ లను పొందుపరిచి దరఖాస్తు చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వితంతు, చేనేత, మత్సకార, ఒంటరి మహిళ, కల్లుగీత, ట్రాన్స్ జెండర్, డప్పు కళాకారులు, వృద్దాప్య, HIV బాధితులకు ఇస్తున్న రూ.3వేలను రూ.4వేలకు, దివ్యాంగులకు ఇచ్చే రూ.3వేలను రూ.6వేలకు, కదల్లేకుండా ఉన్న వారికి రూ.5వేల నుంచి రూ.15వేలకు, తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచారు.