Dil Raju: ఓ వైపు ఐటీ దాడులు.. దిల్ రాజు తల్లికి తీవ్ర అస్వస్థత
Dil Raju Mother Hospitalized: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఇల్లు, కార్యక్రమాలపై ఐటీ దాడులు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు. మూడు రోజులుగా ఆయన ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో దిల్ రాజు తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో ఉన్న ఆమెను ఐటీ అధికారుల వాహనంలోనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆస్పత్రికి దిల్ రాజు కుటుంబ సభ్యులతో పాటు ఓ ఐటీ అధికారి కూడా వెళ్లినట్ట తెలుస్తోంది. అయితే ఆయన తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని సిన్నిహిత వర్గాల నుంచి సమాచారం.
కాగా ఈ సంక్రాంతికి పండుగ సందర్భంగా ఆయన నిర్మాణ సంస్థ నుంచి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌గా నిలవగా.. సంక్రాంతికి వస్తున్నాం మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాదు బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రెండు వారాల్లోనే ఈ సినిమా సుమారు రూ. 200 కోట్ల క్లబ్లో చేరింది. గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయిన మొదటి రోజు వసూళ్లు మాత్రం బాగానే చేసినట్టు తెలుస్తోంది. ఇలా ఆయన మంచి కలెక్షన్స్ సాధించిన నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ ఆయన ఇంట్లో దాడులు నిర్వహిస్తోంది. మూడు రోజులుగా దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.