Dil Raju’s AI Company: నిర్మాత దిల్ రాజు ఏఐ కంపెనీ – ఇకపై తెలుగు సినిమాల్లో కొత్త టెక్నాలజీ!

Dil Raju Starts New AI Company Announced by the Video: టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు మరో కొత్త అడుగు వేశారు. ఇప్పటికే నిర్మాతగా.. తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడిగా సినీరంగంలో రాణిస్తున్న ఆయన తాజాగా మరో కొత్త వ్యాపార రంగంలోకి అడుపెడుతున్నారు. మారుతున్న టెక్నాలజీ, ట్రెండ్‌ని సినీపరిశ్రమకు అందుబాటులో ఉంచేందుకు ఏఐ కంపెనీతో జతకట్టారు. ఏఐ పవన్ మీడియా కంపెనీని ప్రారంభిస్తున్నట్టు తాజాగా ఓ ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో మే 4న ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్టు చెప్పారు.
తెలుగు సినిమాల్లో ఏఐ టెక్నాలజీకి సంబంధించిన పనులు చేసే క్యాంటమ్ ఏఐ గ్లోబల్ సంస్థతో కలిసి ఆయన కొత్తగా స్టూడియోను ప్రారంభించబోతున్నారు. సినిమా ప్రస్థానం మొదలైన 1913 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు వచ్చాయో ఈ వీడియోలో చూపించారు. దిల్ రాజు ప్రకటన బట్టి చూస్తే.. ఆయన నిర్మించే చిత్రాలతో పాటు ఇతర సినిమాల్లోనూ గ్రాఫిక్స్, విజువల్స్ ఎఫెక్ట్స్ సహా పలు విభాగాల్లో ఏఐ సాంకేతికతని ఉపయోగించబోతున్నారని అర్థమైపోతుంది.
ఇవి కూడా చదవండి:
- Actress Vincy Sony Aloshious: డ్రగ్స్ మత్తులో స్టార్ హీరో – సెట్లో అందరి ముందే నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.. నటి సంచలన వ్యాఖ్యలు!