CS Shanti Kumari : సీఎస్ శాంతి కుమారికి కీలక బాధ్యతలు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

CS Shanti Kumari : సీఎస్ శాంతి కుమారికి కీలక బాధ్యత అప్పగించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ) వైస్ చైర్ పర్సన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. శాంత కుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించనున్నారు. సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ వైస్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు అప్పగించింది.
ప్రభుత్వం కీలక నిర్ణయం..
మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నూతన సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి కె.రామకృష్ణారావును నియమించింది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్త సీఎస్ నియామకంపై కొంతకాలంగా సర్కారు తీవ్ర కసరత్తు చేసింది. సీనియారిటీ జాబితా ప్రకారం రామకృష్ణారావుతోపాటు ఆరుగురు అధికారులు రేసులో నిలిచారు. వారందరి పేర్లను పరిశీలించిన ప్రభుత్వం సమర్థత, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని నిర్ణయించింది.