IPL 2025 : గుజరాత్ జోరుకు బ్రేక్.. లక్నో హ్యాట్రిక్ విజయం

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌లో లక్సో జట్టు జోరు కొసాగిస్తోంది. వరుస విజయాలతో పట్టికలో టాపర్‌గా ఉన్న గుజరాత్‌కు బిగ్ షాక్ ఇచ్చింది. ఓపెనర్ల మెరుపులతో భారీ స్కోర్ దిశగా సాగిన గుజరాత్‌ను 180 పరుగులకే కట్టడి లక్నో కట్టడి చేసింది. తర్వాత ఛేదనలో దుమ్మురేపింది. నికోలస్ పూరన్ (61), ఓపెనర్ ఎడెన్ మర్క్‌రమ్ (58) అర్ధసెంచరీలతో చెలరేగి, ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఆఖర్లలో గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసినా ఇంప్యాక్ట్ ప్లేయర్ ఆయుష్ బదొని (28 నాటౌట్), డేవిడ్ మిల్లర్(7)లు ఇద్దరు ఒత్తిడికి లోను కాలేదు. 20వ ఓవరులో బౌండరీ బాదిన బదొని ఆ తర్వాత సిక్సర్‌తో జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. దాంతో ఐదో విక్టరీకిపై కన్నేసిన గుజరాత్‌కు భంగపాటు తప్పలేదు.