Last Updated:

Virupaksha Movie Review : సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ “విరూపాక్ష” రివ్యూ.. హిట్ కొట్టేశాడా ?

Virupaksha Movie Review : సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ “విరూపాక్ష” రివ్యూ.. హిట్ కొట్టేశాడా ?

Cast & Crew

  • సాయి ధరమ్ తేజ్ (Hero)
  • సంయుక్తా మీనన్ (Heroine)
  • సోనియా సింగ్, సాయి చంద్, సునీల్, బ్రహ్మాజీ, అజయ్, రాజీవ్ కనకాల, రవి కృష్ణ తదితరులు (Cast)
  • కార్తీక్ దండు (Director)
  • బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్‌ (Producer)
  • బి. అజ‌నీష్ లోక్‌ నాథ్‌ (Music)
  • ష్యామ్ ద‌త్ సైనుద్దీన్‌ (Cinematography)
3.2

Virupaksha Movie Review : మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. విభిన్న కథలతో, విలక్షణ పాత్రలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బైక్ యాక్సిడెంట్ తో ప్రాణాపాయం నుంచి బయట పడిన తర్వాత నటించిన తొలి చిత్రం విరూపాక్ష. ఈ సినిమాలో మళయాల ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీతో సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే సమకూర్చడం మరో ప్రత్యేక విషయం అని చెప్పాలి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. కాంతార మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజ‌నీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని, శ్యామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. మిస్టికల్ థ్రిల్లర్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ ఈ సినిమాతో తేజ హిట్ అందుకున్నాడా ? లేదా ?? మూవీ రివ్యూ , రేటింగ్ మీకోసం ప్రత్యేకంగా..

సినిమా కథ (Virupaksha Movie Review)..

1979 నుంచి 1991 మధ్య రుద్రవరం అనే ఊరిలో జరిగే కథే ఈ సినిమా. ఆ ఊరిలో క్షుద్రపూజలు చేస్తున్నారని ఒక జంటని సజీవ దహనం చేస్తారు. దాంతో ఆ ఊరు మొత్తం పుష్కర కాలంలో చనిపోతారని.. మరణించే సమయంలో వాళ్లు శాపం పెడుతూ కన్నుమూస్తారు. కాగా ప్రస్తుతం పుష్కర కాలం దగ్గర పడుతోంది. అఆ సమయంలోనే అ ఊర్లో అమ్మవారి జాతర చూడడానికి సూర్య (సాయి ధరమ్ తేజ్) వస్తాడు. కానీ అనుకోని రీతిలో ఆ ఊరి సర్పంచ్ హరిశ్చంద్ర ప్రసాద్ (రాజీవ్ కనకాల) కుమార్తె నందిని (సంయుక్తా మీనన్)ను ప్రేమిస్తాడు. ఊరి నుంచి సూర్య వెళ్ళిపోయే సమయంలో అమ్మవారి గుడిలో ఓ వ్యక్తి మరణిస్తాడు. దాంతో ఊరికి అరిష్టం అని అష్టదిగ్బంధనం వేస్తారు. అప్పుడు ఒకరి తర్వాత మరొకరు.. నలుగురు మరణిస్తారు. దాంతో ఆ మరణాలని చూసి చలించిన పోయిన సూర్య..వాటిని ఆపాలని, ఆ సమస్యకు పరిష్కారం వెతకాలని డిసైడ్ అవుతారు. అక్కడ నుంచి అసలు కథ మొదలయ్యి.. ఊహించని అవాంతరాలు మధ్య సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ఆ మరణాలకు అసలు కారణం ఏంటి ? ఎవరూ ఇదంతా చేస్తున్నారు ? ఆ సమస్యకు సూర్య ఎలా పరిష్కారం కనిపెట్టాడు ? అనేది కథ…

(Virupaksha Movie Review)  మూవీ విశ్లేషణ.. 

మొదట ఈ మూవీ టైటిల్ గురించి చెప్పాలి. రూపంలేని కన్నును విరూపాక్ష (శివుడి మూడో కన్ను) అంటారు. ఈ సినిమాలో రూపంలోని శక్తితో పోరాటం చేస్తారు కాబట్టి మూవీకి ‘విరూపాక్ష’ టైటిల్ పెట్టినట్లున్నారు. సాధారణంగా చేతబడి లేదా బ్లాక్ మ్యాజిక్ తో కూడిన హారర్ కథ అనగానే మనకు ముందుగా రామ్ గోపాల్ వర్మ సినిమాలో గుర్తొస్తాయి. కానీ ఇటీవల కాలంలో ఈ కాన్సెప్టుతో ఓ పెద్ద హీరో సినిమా చేయటం అంటే సాహసం అనే చెప్పాలి. ఇలాంటి థ్రిల్లర్ కథలకు బేసిగ్గా ఒకటే సూత్రం ఉంటుంది. సినిమా మొదలైంది మొదలు.. క్లైమాక్స్ దాకా చూసే ప్రేక్షకుడుని ఉత్కంఠకు గురి చేస్తూ, మధ్య మధ్యలో భయపెడుతూ.. మొత్తానికి సీటు ఎడ్జ్ లో చూసే థ్రిల్ ఇవ్వగలగాలి. ఈ సినిమాతో ఆ విషయంలో కార్తీక్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అటు హీరోయిజం ఇటు కాన్సెప్టు రెండు బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులకు ఫుల్ ఫీస్ట్ ఇచ్చాడు. స్టార్ హీరో ఉన్నాడు కదా అని.. సినిమాని ఎక్కడ డీవియేట్ చేయకుండా కథలో పాత్రల్ని కథానుగుణంగా నడిపించాడు దర్శకుడు. షాకింగ్ ఫస్ట్ సీన్ తోనే సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చేశారు. ఆ పీరియడ్ లో కథను సెట్ చేసి.. దానికి తగినట్లు విజువల్స్ కు , సౌండ్ మిక్సింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని కరెక్ట్ గా ఇవ్వగలిగారు.

సినిమా ప్రారంభం నుంచి ప్రేక్షకుడి మదిలో సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఈ క్షుద్ర పూజలకు కారణం ఎవరు? అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు వ్యక్తిని చివరి వరకు రివీల్ చేయకుండా సస్పెన్స్ మైంటైన్ చేయడంలో 100 శాతం సక్సెస్ అయ్యారు. అలాగని మరీ ఒళ్లు జలదరించే సీన్స్, అదిరిపోయే థ్రిల్స్ ఉంటాయని ఊహించవద్దు. కథను అటు హారర్ వైపు పూర్తిగా వెళ్లకుండా జాగ్రత్త పడుతూ అదిరిపోయే రేంజ్ లో థ్రిల్ చేశారు. అదే విధంగా క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం సూపర్బ్ అని చెప్పుకోవాలి. రెగ్యులర్ హారర్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా కొత్త కథను చూపించడంలో, పల్లెటూరిలో హారర్ ఎలిమెంట్స్ సెటప్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే మెయిన్ విలన్ ఎవరనే ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది.

Image

నటీనటులు ఎలా చేశారంటే..

హీరోయిజాన్ని ఎలివేత చేయకుండా.. కథ బలం ఉన్న సినిమా ఇది. స్క్రిప్ట్ ని నమ్మి సూర్య పాత్రలో సాయి ధరమ్ తేజ్ పర్ ఫెక్ట్ గా ఇమిడిపోయారు. కొన్ని సీన్స్ లో అయితే సాయి నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ తో గూస్ బంప్స్ తెప్పించేశాడు. సంయుక్త మీనన్ కు మరో సారి పవర్ ఫుల్ రోల్ దొరికింది. కమర్షియల్ సినిమా కథానాయిక పరిధి దాటి నటిగా ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు.  అంతకు ముందు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో కొంచెం గ్లామర్ డోస్ పెంచింది. మిగితా కీలక పాత్రల్లో సునీల్, అజయ్, బ్రహ్మజీ, సాయి చంద్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

అలాగే డైరక్టర్ కార్తీక్‌ తనకు టెక్నికల్ గా మంచి గ్రిప్ ఉందని ప్రూవ్ చేసుకున్నారు. ఆడియెన్స్ ని మెల్లిగా ఎంగేజ్‌ చేస్తూ కథను నడిపాడు. సుకుమార్‌ స్క్రీన్‌ ప్లే గ్రిప్పింగ్‌గా 100% జస్టిస్ చేసేలా ఉంది. ఈ సినిమా విజయంలో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కూడా ముఖ్యపాత్ర పోషించాయని చెప్పాలి. `కాంతార` ఫేమ్‌ అజనీష్‌ లోక్‌నాథ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి పెద్ద అసెట్ గా మారింది. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మొత్తానికి అన్నీ కలిసి సాయి ధరమ్ తేజ్ సాలిడ్ హిట్ కొట్టాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

కంక్లూజన్.. 

విభిన్న కథ.. బెస్ట్ పర్ఫామెన్స్ తో భయపెట్టి “హిట్” కొట్టేశారు..

 

ఇవి కూడా చదవండి: