Last Updated:

Karthi : కార్తీ సినిమా వివదానికి ఇక ముగింపు …అమీర్ కి క్షమాపణలు చెప్పిన జ్ఞానవేల్

గత కొన్ని రోజులుగా కోలీవుడ్ లో దర్శకుడు అమీర్, నిర్మాత జ్ఞానవేల్ రాజా మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే . అయితే ఈ వివాదం అంతా కార్తీ మొదటి సినిమా ‘పరుతివీరన్‌’ విషయంలోనే మొదలయింది . దీని గురించి ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ హాట్ టాపిక్ అయ్యారు. ఈ వివాదం వల్ల హీరో సూర్య,

Karthi : కార్తీ సినిమా వివదానికి ఇక ముగింపు …అమీర్ కి క్షమాపణలు చెప్పిన జ్ఞానవేల్

Karthi : గత కొన్ని రోజులుగా కోలీవుడ్ లో దర్శకుడు అమీర్, నిర్మాత జ్ఞానవేల్ రాజా మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే . అయితే ఈ వివాదం అంతా కార్తీ మొదటి సినిమా ‘పరుతివీరన్‌’ విషయంలోనే మొదలయింది . దీని గురించి ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ హాట్ టాపిక్ అయ్యారు. ఈ వివాదం వల్ల హీరో సూర్య, కార్తీ పేరులు కూడా గట్టిగా వినిపించాయి. ఎందుకంటే కార్తీ మొదటి సినిమా కావడం, నిర్మాత జ్ఞానవేల్ సూర్య ఫ్యామిలీకి చాలా మంచి సన్నిహితుడు కావడం.

ఇక ఇటీవల ఈ వివాదంలోకి దర్శకుడు మరియు నటుడు సముద్రఖని ఎంట్రీ ఇచ్చి జ్ఞానవేల్ పై ఫైర్ అయ్యారు. “నీకు ఎంత ధైర్యం ఉంటే దర్శకుడు అమీర్ పై ఆరోపణలు చేస్తావు. నీకు, కార్తీకి లైఫ్ ఇచ్చింది అతను” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తాజాగా ఈ వివాదానికి ఒక ముగింపు వేస్తూ జ్ఞానవేల్ స్పందించారు . వారు ”పరుతివీరన్‌ సమస్య గత 17 ఏళ్లుగా కొనసాగుతోంది. నేను ఈరోజు వరకు దాని గురించి మాట్లాడలేదు. నేనెప్పుడూ ఆయన్ను ‘అమీర్ అన్నా’ అని పిలుస్తాను. మొదటి నుంచి మా కుటుంబానికి సన్నిహితుడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన నా గురించి చేసిన తప్పుడు ఆరోపణలు నన్ను చాలా బాధించాయి. ఆయన మాటలకు బదులిచ్చే క్రమంలో నేను వాడిన కొన్ని పదాలు తన మనోభావాలను గాయపరిచినట్లయితే నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. నాతో పాటు ఎంతోమందిని ఆదుకునే చిత్ర ప‌రిశ్ర‌మ అంటే నాకు చాలా గౌర‌వం. ధన్యవాదాలు” అంటూ పేర్కొన్నారు.

అసలు ఏమైందంటే.. ఇటీవల కార్తీ నటించిన 25వ సినిమా ‘జపాన్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి కార్తీ 25 సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకులందర్నీ అతిథులుగా ఆహ్వానించారు. అయితే ఆ ఈవెంట్ కి అమీర్ తప్ప మిగతా దర్శకులంతా హాజరయ్యారు. ఈ విషయాన్ని అమీర్ ని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. ‘నాకు ఆహ్వానం అందలేదు. జ్ఞానవేల్ వల్ల నాకు కార్తీ, సూర్య మధ్య గ్యాప్ వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ మాటలకు జ్ఞానవేల్ బదులిస్తూ.. పరుతివీరన్‌ సినిమా సమయంలో ఎక్కువ లెక్కలు చూపించి దర్శకుడు అమీర్ తమ నిర్మాణ సంస్థ నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూళ్లు చేశారని జ్ఞానవేల్ సంచలన కామెంట్స్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యలతో వివాదం మొదలైంది.ఇక దీని మీద దర్శకుడు అమీర్ రియాక్ట్ అవుతూ.. “పరుతివీరన్‌ సినిమాకి పావు వంతు మాత్రమే డబ్బులు ఇచ్చి జ్ఞానవేల్.. సినిమా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. ఆ తరువాత నేను నా స్నేహితులు దగ్గర డబ్బులు తీసుకోని సినిమా పూర్తి చేశాను. నటుడు మరియు దర్శకుడు శశికుమార్ కూడా ఈ సినిమా పూర్తి చేయడానికి డబ్బు సహాయం చేశారు” అంటూ చెప్పుకొచ్చారు.