Last Updated:

Pelli Kani Prasad Trailer: నవ్వులు పూయిస్తున్న పెళ్లి కానీ ప్రసాద్ ట్రైలర్.. ఇదేదో హిట్ అయ్యేలానే ఉందే

Pelli Kani Prasad Trailer: నవ్వులు పూయిస్తున్న పెళ్లి కానీ ప్రసాద్ ట్రైలర్.. ఇదేదో హిట్ అయ్యేలానే ఉందే

Pelli Kani Prasad Trailer: కమెడియన్ సప్తగిరి హీరోగా నటిస్తున్న చిత్రం పెళ్లి కానీ ప్రసాద్. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సప్తగిరి సరసన ప్రియాంక శర్మ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 21 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విక్టరీ వెంకటేష్ చేత రిలీజ్ చేయించారు.

 

పెళ్లి కానీ ప్రసాద్ అంటే తెలుగువారికి తెల్సింది కేవలం వెంకటేష్ మాత్రమే. మల్లీశ్వరి సినిమాలో ఈ పాత్రతో వెంకీ ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ పాత్రపేరుతోనే సప్తగిరి ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ప్రసాద్ .. ఒక పెళ్లికానీ కుర్రాడు. పెళ్లి చేసుకోవాలని ఉన్నా కూడా తన తండ్రి, తాతముత్తాతలు కట్నం తీసుకోవాలని ఒక శాసనాలగ్రంధం రాసి పెడతారు.. దాన్ని పాటించాలని.. కట్నం తీసుకోవాలని పట్టుబడతాడు.

 

ఏజ్ అవుతున్నా కూడా కట్నం సరిగ్గా రావడంలేదని ప్రసాద్ కు పెళ్లి చేయడు. ఇంకోపక్క  హీరోయిన్ కి ఫారిన్ వెళ్లాలని ఆశ. తనను పెళ్లి చేసుకొని కుటుంబాన్ని మొత్తాన్ని ఫారిన్ తీసుకళ్లే బకరా కోసం చూస్తుంటుంది. అలా ప్రసాద్ కనిపిస్తాడు. మరి వీరిద్దరికి పెళ్లి అవుతుందా.. ? పెళ్లి కానీ ప్రసాద్ పెళ్ళైన ప్రసాద్ గా మారాడా.. ? లేదా.. ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

సప్తగిరి అంటే కామెడీకి లోటు లేనట్లే. కథ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. టైటిల్ తోనే కొంతవరకు పాజిటివ్ వైబ్ తీసుకొచ్చిన మేకర్స్.. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలను పెంచేశారు. ట్రైలర్ లోనే ఇన్ని నవ్వులు ఉంటటే సినిమా మొత్తం మంచి కామెడీ ఉంటుందని అభిమానులు అంచనాకు వచ్చేశారు. ఇక డీజే టిల్లు తో ఫేమస్ అయిన మురళీధర్ గౌడ్.. ఇందులో సప్తగిరి తండ్రిగా నటిస్తున్నాడు.వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు మరింత వినోదాన్ని పంచనున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది .

 

చాలా గ్యాప్ తరువాత సప్తగిరి హీరోగా రీఎంట్రీ ఇస్తున్న చిత్రమిది. కమెడియన్ గా పేరుతెచ్చుకున్నాకా .. హీరోగా సప్తగిరి కొన్ని సినిమాలు చేశాడు. అయితే అవి ఆశించినంత ఫలితాన్ని అందుకోకపోవడంతో కొద్దిగా గ్యాప్ తీసుకొని.. స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా నటించడం మొదలుపెట్టాడు. ఇక ఇప్పుడు పెళ్లి కానీ ప్రసాద్ సినిమాతో మరోసారి తన లక్ ను పరీక్షించుకోవడానికి  ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాతో సప్తగిరి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.