Last Updated:

Pawan Kalyan: వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడతాం.. పవన్ కళ్యాణ్

:వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు వారాహి విజయ భేరి సభలో వైసీపీపై విమర్శలు గుప్పించారు పవన్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని.. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్ కల్పిస్తామని పవన్ చెప్పారు.

Pawan Kalyan: వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడతాం.. పవన్ కళ్యాణ్

Pawan Kalyan:వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు వారాహి విజయ భేరి సభలో వైసీపీపై విమర్శలు గుప్పించారు పవన్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని.. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్ కల్పిస్తామని పవన్ చెప్పారు.

వైసీపీఎమ్మెల్యేకు భయపడొద్దు..(Pawan Kalyan)

ప్రజలు వైసీపీఎమ్మెల్యేకు భయపడొద్దని..కూటమి అభ్యర్థుల్ని మెజారిటీతో గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు.ఇక్కడ స్థానికంగా ఎన్నో సమస్యలున్నాయి.కొల్లేరులో చాలా సమస్యలున్నాయి. కూటమి అధికారంలోకి రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామని పవన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో యువత మత్తులో తూగుతున్నారు.నేను మీకు గుండె ధైర్యం ఇవ్వడానికే వచ్చాను. మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది.మీరు అందరూ బాగుండాలనే నా కోరిక. మీ కోసం నా రక్తమైనా చిందిస్తానని పవన్ చెప్పారు. కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని తెలిపారు. ముఠా కార్మికులకు కూడా బెనిఫిట్స్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైకాపా పాలనలో 112 మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయని మీడియాను కట్టడి చేసేందుకు జీవో నెంబర్ 1 తీసుకువచ్చారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన తరువాత కైకలూరులో ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మిస్తామని పవన్ హామీ ఇచ్చారు.