Published On:

Vidadala Gopinath Arrest: మాజీ మంత్రి విడదల రజిని మరిది అరెస్టు.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలింపు!

Vidadala Gopinath Arrest: మాజీ మంత్రి విడదల రజిని మరిది అరెస్టు.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలింపు!

Vidadala Gopinath Arrested by AP police: వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని మరిది అరెస్టు అయ్యారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే గోపీనాథ్‌ను అరెస్టు చేసి గచ్చిబౌలి పీస్‌కు తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా గచ్చిబౌలి పోలీసులకు ఏపీ పోలీసులు సమాచారం ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌కి తీసుకెళ్లారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్నాడని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేసి తాజాగా అరెస్టు చేసింది.

 

విడదల రజనిపై మార్చిలో కేసు నమోదు..

వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజనిపై ఏసీబీ అధికారులు గత నెల మార్చిలో కేసు నమోదు చేశారు. 2020 ఏడాదిలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమ్యాన్నాన్ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు ఉన్నాయి. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని రజినిపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే రజనిపై కేసు నమోదు చేశారు. ఆమెను ఏసీబీ అధికారులు ఈ కేసులో ఏ-1గా చేర్చారు. ఏ-2గా ఐపీఎస్ అధికారి జాషువాపై కూడా కేసు నమోదు చేశారు. ఏ-3గా గోపి, ఏ-4గా రజని పీఏ దొడ్డ రామకృష్ణను నిందితులుగా చేర్చింది. రజని వాటా రూ.2 కోట్లు ఇచ్చినట్లు కేసు నమోదు చేశారు. రజిని మరిది గోపీ, జాషువాలకు చెరో రూ.10లక్షలు ఇచ్చినట్లు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి: