Published On:

Jammu and Kashmir: ఉగ్రవాదులకు ఫుడ్ సహాయం చేసింది వీడే.. ప్రాణ భయంతో నదిలోకి దూకేశాడు!

Jammu and Kashmir: ఉగ్రవాదులకు ఫుడ్ సహాయం చేసింది వీడే.. ప్రాణ భయంతో నదిలోకి దూకేశాడు!

A Man To Have Helped Terrorists In Pahalgam Attack Jumps Into River: పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో ఉగ్రవాదులకు సహకరించిన 23 ఏళ్ల ఇంతియాజ్ అహ్మద్ మాగ్రేను భద్రతా బలగాలే అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించేందుకు అతడిని తీసుకెళ్లారు.

ఈ సమయంలోనే భద్రతా బలగాల నుంచి అతడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లా తంగ్మార్గ్‌కు చెందిన ఇంతియాజ్ పారిపోయే తరుణంలో ఓ నదిలోకి దూకేశాడు. దీంతో నది ప్రవాహానికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

ఇదిలా ఉండగా, దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాంలో ఉన్న వైషవ్ కాల్వలో ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే డెడ్ బాడీ లభ్యమైంది. కాగా, మృతదేహం వద్ద ప్రజలు గుమిగూడారు. కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అతడికి ఎలాంటి సమాచారం తెలియదని అంటున్నారు. విచారణ కోసం వెళ్లిన ఇంతియాజ్ చనిపోవడంతో రాజకీయ పార్టీలకు భద్రతా దళాలకు మధ్య వివాదం తలెత్తింది. కాగా, ఇంతియాజ్.. కావాలనే తప్పించుకునేందుకు నదిలో దూకినట్లు ఓ వీడియో రిలీజ్ అయింది. ఈ వీడియో తనకు తానే దూకినట్లు కనపడడంతో భద్రతా దళాల తప్పు లేదని నిర్ధారణ అయింది.

 

ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే.. ఉగ్రవాదులకు సహాయం చేసినట్లు సమాచారం అందింది. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో నిజం ఒప్పుకున్నాడు. కుల్గాంలోని టాంగ్ మార్గ్ వద్ద సమీపంలో ఉన్న అడవిలో టెర్రరిస్టులకు ఫుడ్, ఆశ్రయం ఇచ్చినట్లు నిజం చెప్పాడు. దీంతో పోలీసులు, ఆర్మీ అతనిని తీసుకొని వెళ్తుండగా.. నదిలో దూకేశాడు.

 

కాగా, ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సకీనా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామన్నారు. అయితే అతడికి రెండు పాక్ ఉగ్రవాదుల సంస్థలతో పరిచయం ఉందని విచారణలో చెప్పాడు. ఇంతలోనే నదిలో దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. నీటిలో కాసేపు ఈత కొట్టగా.. తర్వాత ప్రవాహానికి కొట్టుకుపోయాడు.