Jammu and Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం.. 48 గంటల్లో రెండోసారి

Encounter in Avanti Pohra Area of Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. అవంతి పొరా ప్రాంతంలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు హద్య ఎదురుకాల్పులు జరిగాయి. జమ్మూకశ్మీర్‌లోని నాడర్, ట్రాల్ ప్రాంతాల్లో కాల్పులు జరిగినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌ను భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా చేపట్టాయి. కాగా, గత రెండు రోజుల వ్యవధిలో జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ ఘటన చోటుచేసుకోవడం రెండో సారి.
పుల్వామా జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. నాదిర్ గ్రామంలో ముగ్గురు ఉగ్రవాదులు నక్కినట్లు తెలిసింది. ఈ మేరకు భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ సమయంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
కాగా, పోషియాన్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జెన్ పాథర్ కెల్లర్‌లో చనిపోయిన వారిలో లష్కర్ తోయిబాకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారు.
అంతకుముందు ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు చనిపోయారు. కొంతమంది ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్‌ల్లో వచ్చి కాల్పులు జరిపారు. అనంతరం అక్కడినుంచి అడవిలోకి పారిపోయిన సంగతి తెలిసిందే.
ఈ ఘటన తర్వాత భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా.. ఇటీవల కాల్పుల విరమణ జరిగింది. ఆ తర్వాత ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్థానీ ఉగ్రవాదుల ఫొటోలను పోస్టర్లను ఆ ప్రాంతంలో అంటించి రివార్డు సైతం ప్రకటించారు.