4 Terrorist arrested in J&K: జమ్ముకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్!

4 Terrorist arrested in Jammu & Kashmir: కొంతకాలంగా జమ్ముకాశ్మీర్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులను కాల్చి చంపిన తర్వాత వాతావరణం ఆందోళనకరంగా ఉంది. అయితే మళ్లీ ఇటువంటి దాడులు జరగకుండా ఆర్మీ, భద్రతా సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అనుమానం ఉన్న చోట తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రతాబలగాలు పెద్ద సంఖ్యలో ముష్కరులను హతమార్చాయి. అలాగే పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను అరెస్ట్ చేశాయి. వీరి నుంచి కీలక సమాచారం రాబట్టాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది.
కిష్త్వర్ జిల్లాలోని సింగ్ పొరా ప్రాంతంలో సోదాలు చేస్తున్న భద్రతా బలగాలు, ఆర్మీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. అయితే ఉగ్రవాదులను ఆర్మీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి వివరాలు ఆరా తీస్తున్నారు. మరోవైపు అనుమానిత ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.