Published On:

Kenishaa gets Death Threats: జయం రవితో రిలేషన్‌.. సింగర్‌ కెనీషాకు హత్యా బెదిరింపులు

Kenishaa gets Death Threats: జయం రవితో రిలేషన్‌.. సింగర్‌ కెనీషాకు హత్యా బెదిరింపులు

Singer Kenishaa Gets Death Threats Over Jayam Ravi divorce with wife: ‘జయం’ రవి విడాకుల వ్యవహారంలో రోజుకో ట్విస్ట్‌ నెలకొంటుంది. రవి, ఆయన భార్య ఆర్తి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో సింగర్‌ కెనిషాకు హత్యా బెదిరింపులు వస్తున్నాయి. అంతేకాదు నెటిజన్లు తనని దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు.. అభ్యంతక కామెంట్స్‌ తనని విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు వారి నుంచి వచ్చిన మెసేజ్‌లు, హత్యా బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ని కూడా షేర్‌ చేసింది.

 

కాగా జయం రవి, కెనిషా రిలేషన్‌లో ఉన్నారంటూ కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. అందువల్లే జయం రవి తన భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నాడనే వాదన కూడా ఉంది. ఈ వార్తలను గతంలో వీరిద్దరు ఖండించారు. అయితే తాజాగా ఓ కార్యక్రమానికి కెనీషా, రవిలు జంటగా హాజరవ్వడంతో వీరి డేటింగ్‌ వార్తలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. వారి ఫోటోలు బయటకు రావడంతో జయం రవి భార్య చేసిన పోస్ట్‌తో మరింత హాట్‌టాపిక్‌గా మారింది. తమ విడాకులకు డబ్బు, గొడవలు కాదని, మూడో వ్యక్తి ప్రమేయం వల్లే అంటూ పోస్ట్‌ చేసింది. దీంతో సోషల్‌ మీడియాలో ఆర్తికి మద్దతు పెరగగా.. కెనీషాను దారుణంగా విమర్శిస్తూ ట్రోల్‌ చేస్తున్నారు.

 

“నేను కామెంట్‌ బాక్స్‌ ఆఫ్‌ చేయలేదు. ఎక్కడికి పారిపోలేదు. ఏ విషయాన్ని దాచడం లేదు. నా చర్యలకు నన్ను ప్రశ్నించే హక్కు మీ అందిరికి ఉంది. కానీ, నా విన్నం ఏంటంటే.. మీరు ఏం అడగలనుకున్నా.. ఏం చెప్పాలకున్నా డైరెక్ట్‌గా నన్ను అడగండి. వాటికి సమాధానం చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నా. మీకు నిజానిజాలు చెప్పడం నాకు సంతోషమే. ఇప్పుడు నా చూట్టూ జరుగుతోన్న కొన్ని విషయాలకు నేను బాధ్యురాలిని అని మీరంతా భావిస్తే.. నన్ను కోర్టు ముందు హాజరపరచండి” అని తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ షేర్‌ చేసింది.

 

 

“కానీ, మీరంతా విమర్శిస్తూ.. శాపాలు పెడుతున్నారు. వాటి వల్ల నేను ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నానో కనీసం ఆలోచించారా? కర్మ ఎవరినీ విడిచిపెట్టదు అని మీరంత నిందిస్తున్నారు. కానీ, నిజం బయటకు వచ్చాక మీరు కూడా ఇలాంటి బాధనే అనుభవించాలని నేను కోరుకోవడం లేదు. మీలో చాలామందికి నిజం తెలియకపోవడం వల్ల ఇలాంటి కామెంట్స్‌ నన్ను నిందిస్తున్నారు. మీ భావాలను నేను అర్థం చేసుకోగలను. కానీ, త్వరలోనే నిజం బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నేను తప్పు చేస్తే.. చట్టం వేసే శిక్షను అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అప్పటి వరకు నన్ను ద్వేషించకండి. ప్రశాంతంగా బతకనివ్వండి” అని కెనీషా ఆవేదన వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి: