Home / Jammu and Kashmir
జమ్ము కశ్మీర్‌లోని దోడా ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక అధికారితో సహా నలుగురు భారత ఆర్మీ సైనికులు మరణించారు. సోమవారం రాత్రి రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన దళాలు మరియు జమ్ము అండ్ కశ్మీర్ పోలీసు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ జాయింట్ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు ఎన్కౌంటర్ ప్రారంభమయింది.
జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు మరిన్ని అధికారాలను కల్పిస్తూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 నిబంధనలను సవరించింది.
:జమ్ము కశ్మీర్లో లష్కర్ ఏ తోయిబా టెర్రరిస్టులు మరోమారు రెచ్చిపోయారు. ప్రధానంగా హిందూ భక్తులపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా శివ్ ఖోరీ నుంచి వైష్ణోదేవీకి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఎల్‌ఏటి టెర్రరిస్టులు టార్గెట్‌గా చేసుకున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ మరియు రాజౌరీ జిల్లాల్లో శనివారం తెల్లవారుజామున మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.గురువారం మధ్యాహ్నం పూంచ్‌లోని సురన్‌కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధేరా కి గాలీ మరియు బుఫ్లియాజ్ మధ్య ధాత్యార్ మోర్ వద్ద ఆర్మీ వాహనాలపై సాయుధ ఉగ్రవాదులు దాడి చేయడంతో ఐదుగురు సైనికులు చనిపోగా ఇద్దరు గాయపడ్డారు.
నిమిషాల వ్యవధిలో సోమవారం నాలుగు భూకంపాలు కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ మరియు కాశ్మీర్ మరియు లడఖ్‌ను కుదిపేశాయి. లడఖ్‌లోని కార్గిల్, జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ప్రకంపనలు సంభవించాయి. మధ్యాహ్నం 3:48 గంటల ప్రాంతంలో ఈ ప్రకంపనలు వచ్చాయి.
రూ.250 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జమ్మూ కాశ్మీర్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఆరు చోట్ల సోదాలు నిర్వహించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, జమ్మూ కాశ్మీర్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ మాజీ ఛైర్మన్‌కు చెందిన ప్రాంగణంలో సోదాలు జరిగాయి. ఈ కేసు జమ్మూకశ్మీర్ బ్యాంకుకు సంబంధించినదని అధికారులు గతంలో పేర్కొన్నారు.
జమ్ము కశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు మరణించారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా ధర్మశాల సమీపంలోని బజిమాల్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం చుట్టుముట్టింది. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య భీకర పోరు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కాల్పుల్లో ఓ అధికారి, సైనికుడు ప్రాణాలు కోల్పోగా, మరొకరికి గాయాలయ్యాయని వెల్లడించారు.
జమ్మూలోని రాంబన్ జిల్లాలోని బనిహాల్ ప్రాంతంలో ఆదివారం పోలీసులు 30 కిలోల హై-గ్రేడ్ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కశ్మీర్ నుంచిపంజాబ్కు వెళ్లే మార్గంలో ఇన్నోవా కారులో దీనిని తరలిస్తున్నారు. ఈ సందర్బంగా ఇద్దరు డ్రగ్స్ స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.
జమ్మూ కాశ్మీర్ రాజౌరీకి చెందిన మహిళ, పెళ్లి సాకుతో 20 మందికి పైగా పురుషులను మోసం చేసిన కేసు వెలుగులోకి వచ్చింది. 20 మంది పురుషులు తమ భార్యలు తప్పిపోయారంటూ కంప్లైంట్ ఇవ్వడానికి కాశ్మీర్ పోలీసులను సంప్రదించారు. అయితే అక్కడే ట్విస్ట్ ఉంది. వీరు సబ్మిట్ చేసిన ఫోటోలన్నింటిలో ఉన్నది ఒకే మహిళ కావడం విశేషం.
జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శుక్రవారం అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా బల్తాల్ మరియు పహల్గాం మార్గాల్లో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.