Published On:

Poonam Kaur Tweet: పూనమ్‌ కౌర్‌ షాకింగ్‌ లుక్‌ – ఆమెకు ఏమైందీ.. ఇంతలా మారిపోయింది..

Poonam Kaur Tweet: పూనమ్‌ కౌర్‌ షాకింగ్‌ లుక్‌ – ఆమెకు ఏమైందీ.. ఇంతలా మారిపోయింది..

Actress Poonam Kaur Tweet on he Health Issue: నటి పూనమ్ కౌర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు మాయజాలం వినాయకుడు, సౌర్యం వంటి చిత్రాల్లో నటించింది. తెలుగులోనే కాదు తమిళ్‌, కన్నడ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2022 నుంచి 2006 వరకు బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేసిన ఆమె కెరీర్‌ సడెన్‌గా బ్రేక్‌ పడింది. దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అప్పట్లో ఇండస్ట్రీలో వివాదాలను ఎదుర్కొన్న ఆమె ఇక సినీరంగానికి దూరమైంది.

 

కొంతకాలం అజ్ఞాతంలో ఉన్న ఆమో ఆ తర్వాత సంచలన ఆరోపణలతో వెలుగులోకి వచ్చింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, పవన్‌ కళ్యాణ్‌లపై ఆమె చేసిన ఆరోపణలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. అప్పుడప్పుడు త్రివిక్రమ్‌, పవన్‌ ఉద్దేశిస్తూ ఇన్‌డైరెక్టర్‌గా కామెంట్స్‌ చేస్తూ సటైరికల్‌ ట్వీట్‌ వదులుతుంది. ఈ మధ్య కాస్తా సైలెంట్‌ అయిన పూనమ్‌.. తాజాగా ఏపీలోని పొలిటికల్‌ ఈవెంట్‌లో మెరిసింది. అది ఏకంగా సీఎం చంద్రబాబుకు చిత్రపటాన్ని ఇస్తూ కనిపించింది. ఇందులో ఆమె లుక్‌ కాస్తా భిన్నంగా కనిపించింది. ఆమె చాలా మార్పులు కనిపించాయి. దీంతో పూనమ్‌కి ఏమైందీ? ఎందుకు ఇలా తాయారైందని అభిమానులంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ క్రమంలో తన ఆరోగ్యంపై పూనమ్‌ క్లారిటీ ఇచ్చింది. గత రెండు రోజులు ఫుల్‌ ఎలర్జీతో బాధపడుతున్నాను. దీనివల్ల ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధి కూడా వచ్చింది. అందుకే శరీరం ఇలా ఉబ్బిపోయింది. యాంటి బయోటిక్స్‌ కూడా వాడుతున్నా కదా. అందుకే ఇలా’ అంటూ పూనమ్‌ తన ట్వీట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని , ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని ఆమె టీం స్పష్టం చేసిట్టు చెబుతోంది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలనుకు కోరుకుంటూ ప్రలువురు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా పూర్తిగా సినిమాలు పక్కన పెట్టిన ఆమె ప్రస్తుతం మహిళా రాజకీనేతగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలిగా యాక్టివ్‌గా ఉంది.