Published On:

Operation Keller: భారత్ కొత్త యుద్దం ఆపరేషన్ ‘కెల్లర్’ – ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం!

Operation Keller: భారత్ కొత్త యుద్దం ఆపరేషన్ ‘కెల్లర్’ – ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం!

Indian Army announce Operation Keller: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదుల ఏరిపారేస్తోంది. చివరి ఉగ్రవాది అంతమయ్యేవరు ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా భారత ఆర్మీ కొత్త యుద్ధాన్ని ప్రారంభించింది. ‘ఆపరేషన్ కెల్లర్’ పేరుతో ఉగ్రవాదులకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారంతో ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్ లో భాగంగా షోపియన్‌లో దాడులు జరిపింది.

 

ఈ దాడిలో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు కరుడుగట్టిన ఉగ్రవాదులను మట్టికరిపించినట్టు తాజాగా ఇండియన్ ఆర్మీ ప్రకటించింది.  వివరాల ప్రకారం.. షుక్రూకెల్లర్ అనే ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం వచ్చింది. ఈ మేరకు వెంటనే రంగంలోకి దిగిన భద్రత బలగాలు తనిఖీలు చేశాయి. అయితే భద్రతా బలగాలను గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై ఎదురుకాల్పులు చేశారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్లు తెలిసింది. ఆ ప్రాంతంలో మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారంతో మళ్లీ కాల్పులు చేశారు.

 

ఈ మేరకు చేపట్టిన ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. కాగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఉగ్రవేటను ముమ్మరం చేశారు.  ముగ్గురు లష్కరే టెర్రరిస్టులను భద్రతా బలగాలు గుర్తించాయి. తొలుత షుక్రులో లష్కర్ తోయిబా ఉగ్రవాదులను చుట్టుముట్టి హతం చేశారు. సీఆర్పీఎఫ్, ఆర్మీ కాల్పుల్లో ఒక టెర్రరెస్ట్ మృతి చెందాడు. ఉగ్రవాదులు నక్కి ఉన్న ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించాయి. ఆ తర్వాత ఇద్దరిని హతం చేశారు.