Pm Modi : తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. ఓడిపోతామని తెలిసే వారిద్దరూ రెండు చోట్ల పోటీ – ప్రధాని మోదీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం నుండి మూడు రోజులపాటు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నేడు కామారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని..
Pm Modi : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం నుండి మూడు రోజులపాటు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నేడు కామారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని అన్నారు.
అలానే మాట్లాడుతూ.. ఈసారి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని.. వారి ఆకాంక్షలకు అనుగుణంగా మా విధానాలు ఉన్నాయని మోదీ ప్రకటించారు. రైతుల సంక్షేమం కోసమే బీజేపీ ప్రాధాన్యతనిస్తుందని.. ప్రాజెక్ట్‌ల నిర్మాణం బీఆర్‌ఎస్‌కు ఏటీఎంలా మారిందని దుయ్యబట్టారు. తెలంగాణ అభివృద్ధికి ఖర్చు కావాల్సిన డబ్బులు బీఆర్‌ఎస్ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయని ఫైర్ అయ్యారు. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతను బీఆర్‌ఎస్ మోసం చేసిందని.. పేపర్ లీకేజీలతో నిరుద్యోగ యువత దగా పడ్డారని మోదీ విమర్శించారు.
ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించాం. తెలంగాణలో మాదిగ సమాజానికి తీరని అన్యాయం జరిగిందని.. ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీని వేశాం. బీఆర్‌ఎస్ దళితుడిని సీఎంని చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకుంది. తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పింది. గ్యారంటీలను పూర్తి చేయడమే మోదీ గ్యారంటీ. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని మాట ఇచ్చాం. సీఎంను చేసి తీరుతామని మోదీ ప్రకటించారు. దేశానికి బీసీని ప్రధాని చేసింది కూడా బీజేపీనే. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎవరికి ఎప్పుడు డబ్బులు అవసరమైనా అప్పుడు నీటి పారుదల పథకాలు పెట్టుకున్నారు. ప్రజాధనం అంతా కేసీఆర్ కుటుంబ సభ్యుల జేబుల్లోకి వెళ్ళిందని మోదీ (Pm Modi) అన్నారు.
కేసీఆర్, రేవంత్ ఇద్దరూ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. కామారెడ్డి ప్రజలకు మంచి అవకాశం వచ్చింది. అవినీతి, కుటుంబ పాలనను ఓడించే అవకాశం వచ్చింది. ఆ ఇద్దరూ తమ నియోజకవర్గాల్లో ఓడిపోతామని తెలిసే రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో విజయ కోసం ఈ రెండు పార్టీలు కుట్రలు పన్నుతారన్నారు. బీఆర్‌ఎస్ నుంచి తెలంగాణకు విముక్తి లభించాలి. బీఆర్‌ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు. ఇచ్చిన హమీలను నిలబెట్టుకుంటున్నాం. బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని మోదీ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం మోదీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
26వ తేదీన నిర్మల్, దుబ్బాకలో జరిగే పబ్లిక్ మీటింగుల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు దుబ్బాకకు చేరుకుంటారు. నిర్వహించే పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. సాయంత్రం నాలుగున్నర వరకు నిర్మల్ బహిరంగ సభలో మాట్లాడతారు. అక్కడి నుంచి సాయంత్రం ఐదు గంటల 45 నిమిషాలకు దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని తిరుపతికి బయలుదేరి వెళ్తారు. సోమవారం 27వ తేదీన మహబూబాబాద్ కరీంనగర్ లో జరిగే బిజెపి పబ్లిక్ మీటింగుల్లో పాల్గొంటారు. అనంతరం హైదరాబాదులో రోడ్డు షో తో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ముగుస్తుంది. నవంబర్ 27వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి 6 గంటల వరకు హైదరాబాదులో రోడ్ షో లో నరేంద్ర మోడీ పాల్గొంటారు. విమానాశ్రయం నుంచి ఈ రోడ్ షో ప్రారంభమవుతుంది. అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళ్లిపోతారు.