Last Updated:

Mumbai BMW Hit-and-Run Case: ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసు నిందితుడు మిహిర్ షా అరెస్ట్

ముంబై లోని వర్లీ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షాను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అతను తన బీఎండబ్ల్యూ తో స్కూటర్‌ను ఢీకొట్టి ఒక మహిళ చనిపోవడంతో జూలై 7 నుండి పరారీలో ఉన్నాడు.

Mumbai BMW Hit-and-Run Case: ముంబై  బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసు నిందితుడు మిహిర్ షా అరెస్ట్

Mumbai BMW Hit-and-Run Case: ముంబై లోని వర్లీ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షాను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అతను తన బీఎండబ్ల్యూ తో స్కూటర్‌ను ఢీకొట్టి ఒక మహిళ చనిపోవడంతో జూలై 7 నుండి పరారీలో ఉన్నాడు.మిహిర్ ఏక్ నాథ్ షిండే శిబిరానికి చెందిన శివసేన నాయకుడు రాజేష్ షా కుమారుడు. రాజేష్ షాను వర్లీ పోలీసులు అరెస్టు చేసినప్పటికీ సోమవారం బెయిల్‌పై విడుదలయ్యారు.

స్కూటర్ ను ఢీకొట్టి పరారీలో..(Mumbai BMW Hit-and-Run Case)

జూలై 7వ తేదీ ఉదయం వర్లీలోని అనిబిసెంట్ రోడ్డులో స్కూటర్‌పై వెళ్తున్న జంటను బీఎండబ్ల్యూ ఢీకొట్టింది. ఈ ఘటనలో కావేరీ నఖ్వా అనే మహిళ మృతి చెందగా, ఆమె భర్త ప్రదీప్‌కు గాయపడ్డారు. ఈ సమయంలో బీఎండబ్ల్యూ కారును మిహిర్ షా నడుపుతున్నాడు, అతని డ్రైవర్ రాజరిషి బిదావత్ అతని పక్కనే ఉన్న సీటుపై కూర్చున్నాడు. ఆ తర్వాత కారును బాంద్రా ఈస్ట్‌లోని కాలా నగర్‌లో వదిలేసారు.మిహిర్ షాపై సెక్షన్లు 105 , 281 , 125-బి, 238, 324 (4) (అపరాధానికి పాల్పడడం) కింద కేసులు నమోదు చేసారు. భారతీయ న్యాయ సంహిత. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 184, 134A, 134B, 187 కింద కూడా అతనిపై కేసులు నమోదు చేసారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజేష్ షా సంఘటన తర్వాత తన కొడుకు మిహిర్‌కు ఫోన్ చేసి, డ్రైవింగ్ సీట్లో నుంచి మారమని అక్కడ డ్రైవర్ ను కూర్చోపెట్టమని చెప్పాడు. తన కొడుకును కాపాడేందుకు డ్రైవర్‌ ను నిందితుడిగా చూపాలని రాజేష్ షా ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి: