Priya Prakash Varrier Photos: ప్రియా ప్రకాష్ వారియర్ స్టన్నింగ్ లుక్ – సముద్రం ఒడ్డున సాగరకన్యలా వింక్ బ్యూటీ

Priya Prakash Varrier Latest Photos: ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వింక్ బ్యూటీగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది ఈ మలయాళీ భామ. ఓరు ఆధార్ లవ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

ఈ చిత్రంలో స్కూల్ అమ్మాయిగా కనిపించిన ఆమె ఓ సీన్లో కన్ను గీటుతూ కుర్రకారు మనుసులు దోచేసింది. ఆ సీన్ యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ఈ దెబ్బతో ప్రియా ప్రకాశ్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.

మూవీ రిలీజ్‌కు ముందే ఆమె పేరు నెట్టింట మారుమ్రోగింది. ఇక సినిమా రిలీజ్ తర్వాత ఎక్కడ చూసిన ప్రియా ప్రకాష్ అంటూ కుర్రకారు అంతా ఆమె నామాన్నే జపం చేశారు.

ఆ తర్వాత ఆమె వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఒక్క మలయాళంలోనే కాదు తెలుగు, తమిళం నుంచి కూడా పిలుపు వచ్చింది. ఈ క్రమంలో తెలుగులో చెక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నితిన్ జోడిగా నటించిన ఆకట్టుకుంటుంది.

ఈ మూవీ డిజాస్టరైన ఈ అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన బ్రో సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. అది కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించింది.

ఆమె కెరీర్ పెద్దగా హిట్స్ లేకపోయినా దక్షిణాదినా వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతుంది. మరోవైపు సోషల్ మీడియలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటుంది.

తాజాగా చీరకట్టులో ఈ భామ ఫిదా చేసింది. బ్లాక్ ఫ్యాన్సీ చీరలో సముద్రం ఒడ్డున ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందులో ప్రియా ప్రకాష్ తన అందాలు ఆరబోస్తూ హోయలు పోయింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి