IPL 2025 : చెన్నై సూపర్ కింగ్స్ ఆలౌట్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 155

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో చెన్నై ఆలౌటైంది. 19.5 ఓవర్లలో 154 పరుగులు చేసింది. బ్రెవిస్ (42), ఆయుష్(30), దీపక్ (22), రవీంద్ర జడేజా (21) పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. ఓపెనర్ షేక్ రషీద్ (0) తొలి బంతికే ఔటయ్యాడు. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ నాలుగు వికెట్లు తీశాడు. కమిన్స్ 2, జయ్‌దేవ్ 2, మెండిస్, షమి తలో వికెట్ తీశారు.
వరుస ఓటములతో అట్టడుగున ఉన్న ఎస్ఆర్‌హెచ్ చావోరేవో పోరులో దుమ్ములేపింది. పేసర్లు కట్టదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నై భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేసింది. మహ్మద్ షమీ ప్రారంభంలోనే బ్రేకిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ షేక్ రషీద్(0)ను ఔట్ చేశాడు. 17 ఏళ్ల ఆయుష్ మాత్రే (30) ఆత్మవిశ్వాసంతో ఆడాడు. కమిన్స్ బౌలింగ్‌లో 2 ఫోర్లతో చెలరేగాడు. తడబడుతున్న సామ్ కరన్(0)ను హర్షల్ పటేల్ ఔట్ చేసి చెన్నైని ఒత్తిడిలోకి నెట్టాడు.
కెప్టెన్ కమిన్స్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడబోయిన ఆయుష్ పవర్ ప్లేలోనే ఔట్ కావడంతో చెన్నై కష్టాల్లో పడింది. 47 వద్ద మూడో వికెట్ పడిన చెన్నైని తొలి మ్యాచ్ ఆడుతున్న డెవాల్డ్ బ్రెవిస్ (42), రవీంద్ర జడేజా (21), శివం దూబే (12)లు ఆదుకున్నారు. ధాటిగ ఆడుతున్న జడేజాను మెండిస్ ఔట్ చేశాడు. కాసేపటికే బ్రెవిస్ మెరుపులకు హర్షల్ ముగింపు పలికాడు. హర్షల్ పటేల్ విజృంభణతో వరుసగా వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్‌కి దీపక్ హుడా(22) పోరాడగలిగే స్కోర్ అందించాడు. డెత్ ఓవర్లలో ధాటిగా ఆడిన అతడు 20వ ఓవర్లో ఫోర్ బాది ఔటయ్యాడు. దాంతో 154 పరుగులకు ఆలౌటైంది.