Last Updated:

Madhya Pradesh: గ్యాంగ్ రేప్ కేసులో నిర్దోషిగా విడుదలైన వ్యక్తి రూ. 10,000 కోట్లకు పైగా నష్టపరిహారం కోరాడు.. ఎందుకో తెలుసా?

మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌కు చెందిన ఓ వ్యక్తి గ్యాంగ్ రేప్ కేసులో నిర్దోషిగా విడుదలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. 10,000 కోట్లకు పైగా నష్టపరిహారం కోరాడు.

Madhya Pradesh: గ్యాంగ్ రేప్ కేసులో నిర్దోషిగా విడుదలైన వ్యక్తి  రూ. 10,000 కోట్లకు పైగా నష్టపరిహారం కోరాడు.. ఎందుకో తెలుసా?

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌కు చెందిన ఓ వ్యక్తి గ్యాంగ్ రేప్ కేసులో నిర్దోషిగా విడుదలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. 10,000 కోట్లకు పైగా నష్టపరిహారం కోరాడు. జైలు జీవితం అతని కుటుంబాన్ని ఆకలి బాధలకు, మానసిక వేదనకు గురిచేసిందని తెలిపాబు.

రూ. 10,006.02 కోట్ల పరిహారంలో దేవుడు మానవులకు ఇచ్చిన బహుమతిగా ఇచ్చిన లైంగిక ఆనందాన్ని కోల్పోయినందుకు రూ. 2 లక్షలను కోరాడు.కాంతు, అలియాస్ కాంతిలాల్ భీల్ (35) 2022 అక్టోబర్ 20న స్థానిక కోర్టు తనపై గ్యాంగ్ రేప్ ఆరోపణలను ఉపసంహరించుకోవడంతో జిల్లా మరియు సెషన్స్ కోర్టును ఆశ్రయించాడని అతని న్యాయవాది విజయ్ సింగ్ యాదవ్ తెలిపారు. ఎంపీ ప్రభుత్వంపై, విచారణాధికారులపై ఆయన కేసు జనవరి 10న విచారణకు రానుంది.భారీ నష్టపరిహారం గురించి అడగ్గా మానవ జీవితం విలువైనది అనే కారణంతో రూ. 10,000 కోట్లు కోరినట్లు యాదవ్ చెప్పారు.

2020 డిసెంబర్ 23న సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు తనను అరెస్టు చేసినప్పుడు తన కుటుంబానికి ఏకైక ఆధారం తానేనని భీల్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. వృద్ధుడైన తన తల్లి, భార్య మరియు వారి ముగ్గురు పిల్లలకు తానే ఆధారమని చెప్పాడు.భీల్‌పై జూలై 20, 2018న మానస అనే మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.తనను తన సోదరుడి ఇంటి వద్ద దింపుతాననే నెపంతో తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. తరువాత తనను ఆరునెలలపాటు అత్యాచారం చేసిన మరోవ్యక్తికి అప్పగించాడని ఆరోపించింది. ఈ కేసులో భీల్‌ను అరెస్టు చేసి దాదాపు రెండేళ్లపాటు జైలులో ఉంచారు.

ఇవి కూడా చదవండి: