Home / Madhya Pradesh
మధ్యప్రదేశ్‌లో గత మూడేళ్లలో 31,000 మంది మహిళలు మరియు బాలికలు అదృశ్యమయ్యారని అధికారిక సమాచారం ద్వారా వెల్లడయింది. 2021 మరియు 2024 మధ్య రాష్ట్రంలో మొత్తం తప్పిపోయిన వారిలో 28,857 మంది మహిళలు, 2,944 మంది బాలికలు ఉన్నారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎలాంటి అనుమతులూ లేకుండా నిర్వహిస్తున్న ఓ బాలికల వసతి గృహం నుంచి 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. భోపాల్‌లోని పర్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
మధ్యప్రదేశ్ లో కొత్త మంత్రివర్గం సోమవారం కొలువుదీరింది. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధుమన్ సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, కైలాష్ విజయవర్గియా, విశ్వాస్ సారంగ్ సహా 18 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు
మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల తర్వాత మతపరమైన మరియు బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించాలని ఆదేశాలు జారీ చేసారు. అయితే సాధారణ మరియు నియంత్రిత లౌడ్ స్పీకర్ల వాడకంపై ఎటువంటి నియంత్రణ లేదని తెలిపారు.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం తన పదవికి రాజీనామా చేసిన తర్వాత మీడియాను ఉద్దేశించి వెళ్లి తనకోసం ఏదైనా అడగడం కంటే చనిపోవడమే మేలంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చౌహాన్ భావోద్వేగానికి గురయ్యారు.
: మధ్యప్రదేశ్ నూతన సీఎంగా మోహన్‌యాదవ్ పేరును బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. గత ప్రభుత్వంలో శివరాజ్‌సింగ్ టీమ్‌లో మోహన్ మంత్రిగా పనిచేశారు. డిప్యూటీ సీఎంలుగా జగదీష్ దేవ్డా, రాజేశ్ శుక్లాలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది.
మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తన నియోజకవర్గం దాతియా కోసం హేమ మాలిని డ్యాన్స్‌ను ఒక అభివృద్ది కార్యక్రమంగా లెక్కిస్తూ చేసిన ప్రసంగం యొక్క వీడియో వైరల్ కావడంతో వివాదాస్పదమైంది. నరోత్తమ్ మిశ్రా ఎన్నికల ప్రచార సభలో తాను చేసిన అభివృద్ధి పనులను వివరించారు. దాతియాలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా 'హేమమాలినితో డ్యాన్స్ కూడా చేయించామని చెప్పారు.
సనాతన ధర్మం చుట్టూ ఇటీవల చెలరేగిన వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. విపక్ష ఇండియా కూటమికి భారతదేశ సంస్కృతిపై దాడి చేసి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే రహస్య ఎజెండా ఉందని ఆరోపించారు.
మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన పోస్ట్‌పై ప్రియాంక గాంధీ వాద్రా, ఎంపీ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ యాదవ్‌లతో సహా సీనియర్ కాంగ్రెస్ నేతల 'X' ఖాతాల 'హ్యాండ్లర్ల'పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఇండోర్ పోలీసులు శనివారం తెలిపారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో తన భార్య పెర్ఫ్యూమ్ కొట్టుకుని బయటికి వెళుతుండగా గొడవపడి ఓ వ్యక్తి కాల్చిచంపాడు. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, ఘటన అనంతరం వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు.