Published On:

Maharashtra CM : రోహిత్‌ శర్మకు సత్కారం.. ఇంటికి ఆహ్వానించి సన్మానించిన మహారాష్ట్ర సీఎం

Maharashtra CM : రోహిత్‌ శర్మకు సత్కారం.. ఇంటికి ఆహ్వానించి సన్మానించిన మహారాష్ట్ర సీఎం

Maharashtra CM Devendra Fadnavis : ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఘన సత్కారం లభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన ఇంటికి రోహిత్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా అతడని సీఎం సన్మానించారు. విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

 

రోహిత్‌ ఇటీవల టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. మే 7న అధికారిక ప్రకటన చేశాడు. తెలుపు రంగు జెర్సీలో ఇండియాకు కెప్టెన్‌గా వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవం అన్నాడు. వన్డేల్లో తాను కొనసాగుతానని స్పష్టం చేశాడు. బీసీసీఐ కూడా ధ్రువీకరించింది. రోహిత్ వన్డే జట్టు కెప్టెన్‌గా కొనసాగుతాడని పేర్కొంది.

 

అధికారిక నివాసానికి ఆహ్వానం.. 
రోహిత్‌ రిటైర్మెంట్‌ తర్వాత మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ తన అధికారిక నివాసానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పుష్ఫగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. రోహిత్‌తో కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నాడు. ఇండియా క్రికెట్‌ రోహిత్‌‌ను అధికారిక నివాసం ‘వర్ష’కు ఆహ్వానించి మాట్లాడటం ఎంతో గొప్పగా అనిపించిందన్నారు. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌కు ప్రకటించిన రోహిత్‌ శర్మకు శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించాడు.

 

రోహిత్ బాటలో విరాట్ కోహ్లీ..
దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి కూడా టెస్టులకు వీడ్కోలు పలికాడు. రోహిత్ శర్మ, విరాట్ లేకుండానే జూన్‌ 20 నుంచి భారత్ జట్టు ఇంగ్లండ్‌ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. సిరీస్‌తో యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ భారత్‌కు కొత్త కెప్టెన్‌గా నియమితుడు కానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: