Cylinder Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధరలు.. ఎల్పీజీ ధర ఎంతంటే?

LPG Gas Cylinder Price Today: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్. 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తూ కేంద్ర చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,803 ఉండగా.. దీనిపై రూ.41 తగ్గించింది. దీంతో ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,762 వరకు తగ్గింది. ఈ ధరలు గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం.
కాగా, గతేడాది కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరుగుతూ వచ్చాయి. ఈ ఏడాది తొలుత స్వల్పంగా తగ్గుతూ వస్తున్న ఎల్పీజీ సిలిండర్ ధరపై ఫిబ్రవరిలో రూ.7 తగ్గించగా.. తాజాగా, రూ.41 తగ్గించింది. దీంతో గ్యాస్ ఎక్కువగా ఉపయోగించే వారికి లబ్ధి చేకూరనుంది. ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.
అయితే, గత కొంతకాలంగా గృహ అవసరాల నిమిత్తం ఉపయోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈసారి కూడా ధరల్లో ఎలాంటి మార్పులు లేదు. కానీ కమర్షియల్ సిలిండర్ ధరలపై రేటు తగ్గడంతో కొంత ఉపశమనం కలిగింది. ప్రస్తుతం ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గిన తర్వాత రేటు చూస్తే.. రూ.1,762 ఉండగా.. ముంబైలో రూ.1,714.50కి చేరింది. చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,924.50 ఉండగా.. కోల్‌కతాలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1872కి తగ్గింది.
ఇక, హైదరాబాద్ విషయాలనికొస్తే.. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,985.50కు తగ్గింది. అలాగే 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడంతో రూ.855గానే ఉంది. ఈ ధరలు అన్ని నగరాల్లో స్థిరంగానే కొనసాగుతున్నాయి. గతేడాది 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరపై రూ.62 పెంచగా.. తాజాగా, 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ.41 తగ్గించడంతో చిన్ని వ్యాపారులకు భారీ ఉపశమనం కలిగినట్లుంది.