Delhi excise scam: ఈడీ నా స్టేట్ మెంట్లు ఫోర్జరీ చేసి సంతకం చేయమని బలవంతం చేసింది. . ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ నిందితుడు అరుణ్ రామచంద్ర పిళ్లై
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన తాజా పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త మరియు కేసులో నిందితుడైన అరుణ్ రామచంద్ర పిళ్లై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన వాంగ్మూలాలను ఫోర్జరీ చేసి, వాటిపై సంతకం చేయమని బలవంతం చేసిందని ఆరోపించారు.
Delhi excise scam:ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన తాజా పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త మరియు కేసులో నిందితుడైన అరుణ్ రామచంద్ర పిళ్లై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన వాంగ్మూలాలను ఫోర్జరీ చేసి, వాటిపై సంతకం చేయమని బలవంతం చేసిందని ఆరోపించారు.
ఈడీ బలవంతం చేసింది..(Delhi excise scam)
ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన పిళ్లై, న్యూఢిల్లీలోని సిటీ కోర్టులో తన వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. దీనితో ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ఈడీకి నోటీసులు జారీ చేస్తూ సోమవారం (మార్చి 13)లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.శుక్రవారం కోర్టుకు సమర్పించిన దరఖాస్తులో ఏజెన్సీ ముందు నమోదు చేసిన వాంగ్మూలాలను ఉపసంహరించుకోవాలని పిళ్లై తరపు న్యాయవాది అభ్యర్థించారు. రెండు పత్రాలపై సంతకం చేయమని ఈడీ తనని బలవంతం చేసిందని, అందులో ఒకటి నవంబర్ 2022లో నాటిదని, వాటిని తన వాదనలుగా ఉపయోగించుకున్నారని పిళ్లై ఆరోపించారు.
సౌత్ గ్రూప్ లో కీలకంగా పిళ్లై ..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెకు సన్నిహితయిన పిళ్లై ఆమ్ ఆద్మీకి సుమారు 100 కోట్ల రూపాయల చెల్లించిన “సౌత్ గ్రూప్” అనే సంస్దకు కీలకంగా ఉన్నాడని ఈడీ పేర్కొంది. 2020-21కి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ప్రకారం దేశ రాజధానిలో మార్కెట్‌లో ఎక్కువ వాటాను పొందేందుకు ఆప్ కు ఈ ముడుపులు చెల్లించారు.పిళ్లైని మార్చి 6న ఈడీ అరెస్టు చేసి మరుసటి రోజు కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు అతన్ని ఈడీ కస్టడీకి పంపింది, ఇది మార్చి 13తో ముగుస్తుంది. మరోవైపు శనివారం ఇదే కేసులో కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా ఈడీ విచారిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిసోడియాను గురువారం నాడు మళ్లీ అరెస్టు చేసింది. అతను ఇప్పటికే మార్చి 20 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నాడు. ఎక్సైజ్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ సిసోడియాను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడు రద్దు చేసిన మద్యం పాలసీకి సంబంధించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంను ఈడీ గురువారం 6 గంటలకు పైగా ప్రశ్నించింది.
మనీష్ సిసోడియా తీహార్ జైలు నుండి ఒక సందేశాన్ని పంపారు, జైలు శిక్ష తనకు కష్టాలను కలిగిస్తుంది, అయితే అది తన స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేదని అన్నారు. సాహెబ్, మీరు నన్ను జైలులో పెట్టడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టవచ్చు, కానీ మీరు నా స్పూర్తిని విచ్ఛిన్నం చేయలేరు. బ్రిటీష్ పాలకులు స్వాతంత్ర్య సమరయోధులను కూడా ఇబ్బందులకు గురిచేశారు, కానీ వారి మనోభావాలు విచ్ఛిన్నం కాలేదు. జైలు నుండి మనీష్ సిసోడియా సందేశం అంటూ ఆప్ అధినేత అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి హిందీలో ఒక ట్వీట్ చేసారు.