Director Shankar: కాపీ రైట్ కేసు, ఇది నన్నేంతో బాధించింది – ఈడీ చర్యపై డైరెక్టర్ శంకర్ రియాక్షన్

Director Shankar Reacts on Copyright Case: ప్రముఖ డైరెక్టర్ శంకర్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసిన విషయం తెలిసిందే. ‘ఎంథిరన్’ (Robo Movie) సినిమాకు సంబంధించ కాపీ రైట్ కేసులో ఆయనకు సంబంధించి దాదాపు రూ. 10 కోట్ల స్థిరాస్తులను ఈడీ అలాచ్ చేసింది. దీనిపై డైరెక్టర్ శంకర్ స్పందించారు. తన స్థిరాస్తులను అటాచ్ చేయడంపై డైరెక్టర్ శంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
కోర్టు తీర్పును పక్కనపెట్టి ఈడీ ఇలాంటి చర్యలకు పాల్పడటం తనని బాధించిందని పేర్కొన్నారు. “ఈడీ నాకు సంబంధించిన మూడు స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసిన విషయానికి సంబంధించి పలు విషయాలను ప్రేక్షకుల దృష్టికి తీసుకురావాలనుకుంటన్నా. ఎంథిరన్ చిత్రానికి సంబంబధించి తప్పుడు ఆరోపణలను ఆధారంగా చూపించి నా ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేశారు. ఈ చర్య న్యాయపరమైన వాస్తవాలను సవాలు చేయడమే కాదు, వాస్తవాలను తప్పుదోవ పట్టించేలా ఉంది.
ఎంథిరన్ చిత్రానికి సంబంధించిన కాపీ రైట్ కేసును న్యాయస్థానం క్షుణ్ణంగా విచారన జరిపి తీర్పునిచ్చిన నిచ్చింది. ఇందుకు సాక్ష్యాలు, ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఎంథిరన్ చిత్రానికి సంబంధించిన అసలైన హక్కులు నాకే ఉన్నాయని తీర్పు ఇస్తూ అరూర్ తమిళనాథన్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ సినిమా విషయంలో కాపీ రైట్ ఉల్లంఘన జరగలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కానీ, ఈ కేసులో కోర్టు తీర్పును పక్కన పెట్టి, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈడీ నా ఆస్తులను అటాచ్ చేసింది. ఈడీ చర్య నన్నేంతో బాధించింది” అని శంకర్ అన్నారు.