Home / Enforcement Directorate
అగ్రిగోల్డ్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవీ రామారావు, శేషునారాయణరావు, హేమసుందర్ అనే వ్యక్తులపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. వారితోపాటు అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలపై ఛార్జిషీట్ వేసింది.
నకిలీ బిల్లింగ్ ద్వారా పన్ను ఎగవేతలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వస్తువులు మరియు సేవల పన్ను నెట్వర్క్ ( జీఎస్టీఎన్ )ని మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) పరిధిలోకి చేర్చింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జీఎస్టీఎన్ పరిధిలో పన్ను ఎగవేతలకు వ్యతిరేకంగా చర్య తీసుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)కి మరింత అధికారం లభించనుంది
ఉద్యోగాల కోసం నగదు కుంభకోణంలో తమిళనాడు మంత్రి వి సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడం రాష్ట్రంలోని అధికార డిఎంకె, బిజెపి మరియు ఎఐడిఎంకె, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది మంత్రికి ఛాతి నొప్పి రావడంతో బుధవారం ఉదయం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. మనీలాండరింగ్ కేసులో బాలాజీని అరెస్ట్ చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ లోక్‌సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీని దుబాయ్ వెళ్లే విమానం ఎక్కకుండా కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడ్డుకున్నారు. బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ స్కామ్‌కు సంబంధించి ఆమెను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
ఛత్తీస్‌గఢ్ లో బొగ్గు రవాణాపై అక్రమంగా వసూలు చేసిన కేసులో రూ.51.40 కోట్ల విలువైన 90 స్థిరాస్తులు, విలాసవంతమైన వాహనాలు, నగలు, నగదును జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం వెల్లడించింది.
చత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంలో కాంగ్రెస్ నేత, రాయ్‌పూర్ మేయర్ ఐజాజ్ ధేబర్ సోదరుడు అన్వర్ ధేబర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్టు చేసింది.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ స్కామ్ లొ 2,000 కోట్ల విలువైన మనీలాండరింగ్‌కు సంబంధించిన ఆధారాలను కనుగొన్నట్లు తెలిపింది
ప్రైమరీ టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ నిందితుల ద్వారా దాదాపు రూ.250 కోట్లు సంపాదించారు. రోజురోజుకు మరిన్ని విషయాలు వెల్లడవుతుండడంతో ఈ మొత్తం రూ.500 కోట్లకు చేరుకోవచ్చని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో తేలింది.
దౌత్య మార్గాల ద్వారా కేరళలోకి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలపై ఇటీవల జరిపిన సోదాల తర్వాత రూ.1.13 కోట్ల విలువైన ఏడు స్థిరాస్తులు, రూ.27.65 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం వెల్లడించింది.
MLC Kavitha: దిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నుంచి మరోసారి పిలుపు అందింది. నేడు ఈడీ కార్యాలయానికి రావాలని.. లేఖ ద్వారా తెలిపింది.
Delhi liquor Scam: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. సుమారు ఎనిమిదిన్నర గంటలపాటు విచారణ కొనసాగింది. ఈ మేరకు విచారణ ముగిసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన విచారణ 9గంటల సమయంలో ముగిసింది.