Published On:

Amul milk : అమూల్ పాల ధర పెరిగింది.. ఎంతంటే?.. నేటి నుంచి అమల్లోకి

Amul milk : అమూల్ పాల ధర పెరిగింది.. ఎంతంటే?.. నేటి నుంచి అమల్లోకి

Increased price of Amul milk : మన మైండ్ రిలీప్ ఉండాలంటే రోజు టీ తాగాల్సిందే. ఇప్పుడు టీ తాగుదామంటే పాలు కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే రోజురోజుకూ పాల ధరలు పెరుగుతున్నాయి. దీంతో సామాన్య జనాలు కొనలేని పరిస్థితి నెలకొంది. మదర్ డెయిరీ కంపెనీ పాల ధరలను పెంచిన విషయం తెలిసిందే. అదే బాటలో మరికొన్ని కంపెనీలు పాల ధరలు పెంచేశాయి. తాజాగా అమూల్ డెయిరీ పాల ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన పాల ధర రేట్లు నేటి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. లీటర్‌కు రూ.2 పెంచుతున్నట్లు ప్రకటించింది. అముల్ స్టాండర్డ్, బఫెలో, గోల్డ్, స్లిమ్, ట్రిమ్, టి-స్పెషల్, తాజా, కౌ పాల ధరలు పెరిగాయి. గతంలో 500 మి.లీ.లకు రూ.36కి బఫెలో ఫుల్ క్రీమ్ పాలు దొరికేది. ఇప్పుడు ఆ మిల్క్ రూ.37లకు లభిస్తాయి. అదేలీటరు పాలు గతంలో రూ.71 ఉండగా, ప్రస్తుతం రూ.73లకు లభిస్తుంది. ముడి పదార్థాల ధరలు పెరగడంతోనే అమూల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

 

ముడి పదార్థాల ధరలు అమాంతంగా పెరగడం వల్లే మదర్ డెయిర్ పాల ధరలను పెంచినట్లు తెలిపింది. మదర్ డెయిరీ కంపెనీ తన ఔట్ లెట్లు, రిటైలర్లు ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియనా మార్కెట్ల‌లో రోజూ దాదాపు 35 లక్షల లీటర్ల పాలను అమ్ముతోంది. యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్, బీహార్ వంటి తదితర రాష్ట్రాల్లో పాలను విక్రయిస్తోంది. కొన్నినెలల నుంచి కొనుగోలు ఖర్చు లీటరుకు రూ.4 నుంచి రూ.5 పెరిగింది. ప్రస్తుతం వేసవి కాలం కావడం వల్లే వేడి గాలులతో సేకరణ ఖర్చు పెరుగుతుందనే కారణంతో పెంచినట్లు తెలిపింది.

 

ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో టోన్డ్ మిల్క్ ధర లీటరుకు రూ.54 నుంచి రూ.56 పెరిగింది. ఫుల్-క్రీమ్ పాలు, టోన్డ్ పాలు ధర లీటరుకు రూపాయి పెరిగి లీటరుకు రూ.69 రూ.57కి చేరుకుంది. డబుల్ టోన్డ్ మిల్క్ లీటరుకు రూ.2 పెరిగి, ప్రస్తుతం లీటరుకు రూ.51కి పెరిగింది. ఆవు పాలను లీటరుకు రూ.57 నుంచి రూ.59కి మదర్ డెయిరీ కంపెనీ పెంచింది. మదర్ డెయిరీ చిన్న 500 మి.లీ ప్యాక్‌ల్లో ఫుల్-క్రీమ్, టోన్డ్, డబుల్-టోన్డ్, ఆవు పాల ధరలను లీటరుకు రూపాయలు పెంచింది. అద్ద లీటరు ఫుల్ క్రీమ్ పాలు రూ.35, టోన్డ్ పాలు రూ.29, డబుల్ టోన్డ్ పాలు రూ.26, ఆవు పాలు రూ.30గా నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి: