Published On:

Supreme Court : బలగాల మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దు : పిటిషనర్‌ తీరుపై సుప్రీం ఆగ్రహం

Supreme Court : బలగాల మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దు : పిటిషనర్‌ తీరుపై సుప్రీం ఆగ్రహం

Supreme Court : జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం పిటిషనర్‌‌ మందలించింది. పిటిషనర్‌ తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌ వేసేముందు బాధ్యతగా వ్యవహరించాలని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. దేశంపై బాధ్యత లేదా అంటూ ప్రశ్నించింది. బలగాల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాలి..
ఇది కష్టకాలం అని కోర్టు వ్యాఖ్యానించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశప్రజలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పహల్గాం దాడిని రిటైర్డు న్యాయమూర్తి నేతృత్వంలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారని కోర్టు పిటిషనర్‌కు తెలిపింది. ఇలాంటి కేసులను దర్యాప్తు చేయడంలో న్యాయమూర్తులు ఎప్పటి నుంచి నిపుణులుగా మారారు? అని ప్రశ్నించింది. వారు తీర్పు మాత్రమే చెప్పగలరని పేర్కొంది. మమ్మల్ని ఆర్డర్ జారీ చేయమని అడుగొద్దని పిటిషనర్‌ను కోర్టు మందలించింది. విషయం తీవ్రతను చూడాలని సుప్రీంకోర్టు చెప్పింది.

 

 

ఇవి కూడా చదవండి: