Published On:

Kakani Govardhan Reddy: వైసీపీ నేత కాకాణికి బిగ్ షాక్.. బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

Kakani Govardhan Reddy: వైసీపీ నేత కాకాణికి బిగ్ షాక్.. బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

Supreme Court Reject Bail quartz case for YCP Leader Kakani Govardhan Reddy: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు కేసులో ఆయనకు సుప్రీంకోర్టు చుక్కెదురైంది. ఈ మేరకు ముందస్తు బెయిల్ కోసం దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిరాకరించింది. కాగా, ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్న సంగతి తెలిసిందే.

 

కాగా, ఏపీలోని పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో కాకాణిపై ఫిబ్రవరిలో క్వార్టజ్ కేసు నమోదైంది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధలకు విరుద్ధంగా పేలుడుకు సంబంధించిన పదార్థాలను వినియోగించడం వంటి తదితర అంశాలపై పీఎస్‌లో కేసు నమోదైంది.ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.