Telangana Tet Notification : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల

Telangana Tet Notification : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 15వ తేదీ నుంచి జూన్ 30 వరకు మధ్య టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. బీసీ రిజర్వేషన్ల బిల్లు సంగతి తేలిన తర్వాతే తెలంగాణలో పెద్దసంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు నిర్వహించే టెట్ పరీక్షను నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే ఏడాదికి రెండుసార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని సర్కారు గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది. కాగా, ఇందుకు సంబంధించిన సమాచారం ఈ నెల 15 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు.